T Congress: ఈ రోజు గాంధీ భవన్ లో జరుగనున్న ఈ సమావేశంలో ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ తోపాటు 23 మంది పీఏసీ మెంబర్లు, ఇతర పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి యేడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పాలన తీరుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు తీరు, రాబోయే నాలుగేండ్లలో కాంగ్రెస్ ప్రతిష్టను పెంచే రీతిలో ఎలాంటి పాలన చేపట్టాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.
వీటితో పాటు అలాగే, కేబినెట్ విస్తరణ, మిగిలిన నామినేటెడ్ పోస్టులు, పీసీసీ కార్యవర్గం భర్తీపై కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న లోకల్ బాడీ ఎన్నికలతో పాటు మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, వారిని గెలిపించుకునేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే అంశంపై ఇందులో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. హైకమాండ్ తరఫున కేసీ వేణు గోపాల్ పార్టీ నేతలకు ఎలాంటి దిశా నిర్దేశం చేయనున్నారనే దానిపైనే రాష్ట్ర పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.