విశాఖ: సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ఏపీ సర్కార్ తో ప్రముఖ కంపెనీలు రూ. 2 లక్షల కోట్లు విలువ చేసే ఒప్పందాలు చేసుకున్నాయి.  ఈ ఒప్పందాలు గనుక అమల్లోకి వస్తే 3 నుంచి 4 లక్షల మందికి ఉపాది లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చడం లేదు. ఒప్పందాలు 30 నుంచి 40 శాతం వరకు మాత్రమే అమల్లోకి వస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పరిశ్రమలకు రాయితీయల భారం రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గేదని..ఇంత కంటే మూడు రెట్లు పరిశ్రమలకు అదనంగా ప్రోత్సాహం ఉంటుందనే అభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి.