Gorantla Madhav: అది గోరంట్లదో కాదో ప్రజలకు తెలుసు.. థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్
Gorantla Madhav: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.
Gorantla Madhav: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైరల్ గా మారిన ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రకటించినా దుమారం మాత్రం ఆగడం లేదు. వీడియో ఫేక్ అంటూ ఎస్పీ చేసిన ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. విచారణ జరపకుండానే వీడియోను ఫేక్ అని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నాయి. అటు వైసీపీ నేతలు మాత్రం ఎస్పీ ప్రకటనను ఆధారంగా చేసుకుని టీడీపీ నేతలకు కౌంటరిస్తున్నారు. గోరంట్ల మాధవ్ వీడియోపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని .. చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.
తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై ఆ పార్టీ మాజీ నేత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఎంపీ మాధవ్ పార్లమెంట్ పరువు తీశారని పృథ్వీ విమర్శించారు. గోరంట్ల తీరుతో తెలుగు ఎంపీలకు పార్లమెంట్ లో ఉన్న చరిత్రపై మచ్చ పడిందన్నారు. అంగబలంతో పాటు అర్థబలం ఉండటంటం వల్లే ఎంపీ గోరంట్లను వైసీపీ నేతలు వెనకేసుకుని వస్తున్నారని పృథ్వీరాజ్ ఆరోపించారు. న్యూడ్ వీడియోపై గోరంట్ల మాధవ్ స్పందించిన తీరు దారుణంగా ఉందన్నారు. ఇంతటి దౌర్భాగ్యం గతంలో ఎన్నడూ చూడలేదన్నారువైసీపీ నేతలకు కూడా గోరంట్ల వ్యవగహారం నచ్చినట్లు ఉందంటూ పృథ్వీరాజ్ సెటైర్లు వేశారు. గోరంట్ల వీడియోను ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఎలా చెప్పారని ప్రశ్నించారు.
గతంలో తన వీడియో వచ్చినప్పుడు మాట్లాడిన వైసీపీ నేతలు.. ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని పృథ్వీరాజ్ నిలదీశారు. గోరంట్ల వ్యవహారంలో వారం పాటు మీడియా సమావేశాలు పెట్టిన నేతలు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు.వైసీపీ నేతల తీరు మనిషికోలా మారుతుందా అంటూ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మండిపడ్డారు. డబ్బు, పలుకుబడి, కులం అన్నీ మాధవ్ కు కలిసి వచ్చాయన్నారు. అనంతపురం ఎస్పీ చెప్పిన వివరాలు గందరగోళంగా ఉన్నాయన్నారు. అసలు ఆ వీడియో ఫేక్ అని ఎలా తేల్చారో తనకు అర్థం కావడం లేదన్నారు వైసీపీ మాజీ నేత పృథ్వీరాజ్. పోలీసులు, వైసీపీ నేతలు ఫేక్ అని చెప్పినా ఏది నిజమే ప్రజలకు అంతా తెలుసన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోకు సంబంధించి వైసీపీ మాజీ నేత పృధ్వి రాజ్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఎస్వీబీసీ చైర్మెన్ గా ఉన్న సమయంలో పృధ్విరాజ్ వీడియో లీకై వైరల్ గా మారింది. ఏపీలో రాజకీయ రచ్చకు కారణమైంది. ఆ ఘటనలో పృధ్విరాజ్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి వైసీపీపై కోపంగా ఉన్నారు. ఇటీవలే జనసేన నేత నాగబాబును కలిశారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ. దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం సాగింది. తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై పృధ్విరాజ్ స్పందనతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని తెలుస్తోంది.
Also Read: TS Eamcet 2022 Result: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడే..! విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook