AP Corona Update: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 547 మందికి పాజిటివ్!
AP Corona: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 547 మందికి పాజిటివ్ గా తేలింది.
Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 33 వేలకు పైగా శాంపిల్స్ పరీక్షించగా 547 మందికి కరోనా పాజిటివ్ గా (Corona Cases in AP) నిర్ధారణ అయింది. వైరస్ తో విశాఖలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 14, 500కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 128 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 2, 266 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ ఆందోళకు గురిచేస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు 28 ఒమిక్రాన్ కేసులు (Omicron Cases in AP) నమోదయ్యాయి.
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10 రెట్లు పెరిగాయి. డిసెంబర్ 28న దాదాపు 9వేలకు పైగా కేసులు నమోదు కాగా..నిన్న 90వేల పైచిలుకు కేసులు (Corona Cases in India) వచ్చాయి. ముందురోజు కంటే 56 శాతం అధికంగా కేసులు బయటపడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
Also Read: AP Omicron cases: ఏపీలో మరో 4 ఒమిక్రాన్ కేసులు... మొత్తం కేసులెన్నంటే?
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో మూడోవేవ్‌కు ఆజ్యం పోస్తోంది. ఇవాళ 495 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మెుత్తం ఒమిక్రాన్ కేసులు 2,630కి (Omicron Cases in India) చేరాయి. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ (Lock down) అమలు చేసేందుకు సిద్దపడుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు లాక్ డౌన్ ప్రకటించగా, కర్ణాటక వీకెండ్ కర్ఫ్యూ (Weekend curfew) అమలు చేస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..ప్రతి ఒక్క పౌరుడూ కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ విజ్ఞప్రి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి