Singer Sunitha: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సింగర్ సునీత.. ఏమైందంటే..?

Singer Sunitha interview: సింగర్ సునీత గతంలో ఉషా తో విభేదాలు ఉన్నాయ్ అంటూ వచ్చిన వార్తలపై.. స్పందిస్తూ.. కొద్దిరోజుల క్రితం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అప్పట్లో సునీత విష గురించి చెప్పిన వ్యాఖ్యలు.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ సునీతకి, సింగర్ ఉషాకి మధ్య జరిగింది ఏమిటి.. సునీత ఈ విషయంపై ఎలా స్పందించింది అనే విషయం ఒకసారి చూద్దాం..  

1 /4

తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. రెండు దశాబ్దాలకు పైగా తన పాటలతో, గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా సునీత సింగర్ గా కంటే రెండో పెళ్లి చేసుకున్నప్పుడే ఈమె పేరు మరింత వైరల్ గా మారింది. చాలామంది ఈమె రెండో పెళ్లి చేసుకున్న సమయంలో దారుణంగా ట్రోల్ చేశారు. కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది సింగర్ సునీత.  

2 /4

సింగర్ సునీత తన సినీ కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పింది. సినీ లైఫ్ లో సక్సెస్ అయిన సింగర్ సునీత తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా.. రెండవ వివాహం అనంతరం సునీత కొంతమేరకు తన లైఫ్ ను బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో సింగర్ సునీత రెండవ పెళ్లి ప్రకటన సమయంలో చేసినటువంటి కొన్ని వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం విన్న అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు..  

3 /4

సునీత సింగర్ కావాలనే ఉద్దేశంతోనే 15 ఏళ్ల వయసులోనే ప్లే బ్యాక్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో మరుపురాని పాటలను పాడి ప్రేక్షకుల మధిలో నిలిచిపోయిన సునీత ఎన్నో అవార్డులను, పురస్కారాలను కూడా అందుకున్నది. సునీత 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కిరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.. అయితే ఆ తర్వాత సునీత కొన్ని కారణాల చేత తన భర్త నుంచి విడిపోయింది. అలాగే పాటలు పాడుతూ డబ్బింగ్ చెబుతూ తన ఇద్దరు పిల్లలని పోషిస్తూ ఉండేదట.    

4 /4

ఇక రెండవ పెళ్లి ప్రముఖ మీడియా సంస్థ అధినేత అయిన రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. వివాహమైన తర్వాత ఒక ఇంటర్వ్యూలో సింగర్ ఉషా తో విభేదాల గురించి మాట్లాడుతూ.. తనకు ఎవరి మీద ఎలాంటి జలస్ ఉండదని, ఒకవేళ అలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటే తాను ఎప్పుడూ తన జీవితంలో ఎదురైన సంఘటనలను చూసి ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేదాన్ని.. అందుకే తాను ఎలాంటి వివాదాలను పట్టించుకోను కాబట్టి ఇలా ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం గతంలో మాట్లాడిన సింగర్ సునీత వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.