ఏపీలో మరో 57 కరోనా కేసులు.. తాజాగా ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల తీవ్రత పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో తాజాగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
APFightsCorona | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల తీవ్రత పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో తాజాగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2339కి చేరింది. తాజాగా మరో రెండు కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనా కాటుకు 52 మంది బలయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 691. షర్ట్ లేకుండా మహేష్ బాబు.. ఫొటో వైరల్
రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,739 శాంపిల్స్ పరీక్షించగా 57 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 69 మంది కరోనా వైరస్ బారి నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ అయ్యారు. తాజా కరోనా మరణాలో చిత్తూరు, కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. నా విన్నపాన్ని మన్నించండి: ఫ్యాన్స్‌ను కోరిన NTR
కాగా, ఏపీలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం 2339 పాజిటివ్ కేసులకుగాను 1596 మంది డిశ్చార్జ్ కాగా, 52 మంది మరణించారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో చిత్తూరులో 12, నెల్లూరులో 7 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చిన వారివి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలో 150 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 25 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు