నా విన్నపాన్ని మన్నించండి: ఫ్యాన్స్‌ను కోరిన NTR

ఇటీవల మెగా పవర్ స్టార్ బర్త్ డే కానుకగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్‌ను అందించింది RRR యూనిట్. కానీ ఎన్టీఆర్ బర్త్‌డేకు  RRR యూనిట్ సర్‌ప్రైజ్ లేదని టీమ్ చెప్పడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Last Updated : May 19, 2020, 08:31 AM IST
నా విన్నపాన్ని మన్నించండి: ఫ్యాన్స్‌ను కోరిన NTR

ఇటీవల మెగా పవర్ స్టార్ బర్త్ డే కానుకగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్‌ను అందించింది RRR యూనిట్. కానీ ఎన్టీఆర్ బర్త్‌డేకు  RRR యూనిట్ సర్‌ప్రైజ్ లేదని టీమ్ చెప్పడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. లాక్‌డౌన్ కారణంగా RRR సినిమా నుంచి జూ. ఎన్టీఆర్ లుక్ గానీ, టీజర్ లాంటి సర్‌ప్రైజ్ లేకపోవడం ఫ్యాన్స్‌ను బాధిస్తోంది. దీనిపై ఎన్టీఆర్ తన భిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ భావోద్వేగంతో ఓ లేఖ రాశారు.  బంగారం భగభగలు.. షాకిచ్చిన వెండి ధరలు

‘ప్రియమైన అభిమాన సోదరులకు విన్నపం.
ఈ విపత్తు సమయంలో మీరు, మీ కుటుంబంతో పాటు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. అందరం కలిసి పోరాడితేనే కరోనా సమస్య నుంచి సురక్షితంగా బయటపడతాం. ప్రతి ఏటా నా పుట్టినరోజు సందర్భంగా మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఆశీర్వాదంగా భావిస్తాను. ఈ ఏడాది అధికారుల సూచనలు పాటిస్తూ, భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలి. అదే మీరు నాకిచ్చే విలువైన బహుమతి. మరోసారి హాట్ టాపిక్ అయిన రష్మీ గౌతమ్ వ్యాఖ్యలు..

Image Credit: twitter/NTR

నా బర్త్‌డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఏ విధమైన ఫస్ట్ లుక్, టీజర్ గానీ విడుదల కావడం లేదు. ఈ విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని అర్ధం చేసుకోగలను. కానీ ఫస్ట్ లుక్, టీజర్ మీ ముందుకు తెచ్చేందుకు టీమ్ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అన్ని విభాగాల వారు పని చేయాలి. కానీ లాక్‌డౌన్ ఆంక్షల వల్ల అది సాధ్యం కాలేదు.  Photos: అందాలతో అదరగొడుతున్న RX 100 భామ

దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న RRR సినిమా ఓ సంచలనంగా మిగులుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ సినిమా మమ్మల్ని తప్పక అలరిస్తుంది. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ’ మీ ఎన్టీఆర్ అంటూ భావోద్వేగంతో ఫ్యాన్స్‌కు లేఖ రాశారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు

Trending News