ప్రకాశం బ్యారేజీకి 60 ఏళ్ళు..!
సర్ ఆర్థన్ కాటన్ నిర్మాణ సారథ్యంలో విజయవాడ వద్ద, కృష్ణా నది పై కట్టబడి వినుతికెక్కిన బ్యారేజే `ప్రకాశం బ్యారేజి`.
సర్ ఆర్థన్ కాటన్ నిర్మాణ సారథ్యంలో విజయవాడ వద్ద, కృష్ణా నది పై కట్టబడి వినుతికెక్కిన బ్యారేజే 'ప్రకాశం బ్యారేజి'. 1852లో ప్రారంభమైన దీని నిర్మాణం 1855లో పూర్తయింది. దాదాపు 100 సంవత్సరాల క్రితమే కృష్ణా నది జలాలను సాగునీటి అవసరాలకు కేటాయించిన మొట్టమొదటి నిర్మాణం జరిగింది. అయితే పాత ఆనకట్ట కొట్టుకుపోగానే.. ఇదే బ్యారేజిని పునర్ నిర్మించుట భారత ప్రభుత్వం సంకల్పించి 1954 ఫిబ్రవరి 13 తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది.
1957 డిసెంబర్ 24 న బారేజిపై పూర్తిస్థాయిలో రాకపోకలు మొదలయ్యాయి. ఈ రోజుతో ప్రకాశం బ్యారేజీని అధికారికంగా భారత ప్రభుత్వం ప్రారంభించి 60 సంవత్సరాలు కావస్తోంది. ఈ సందర్భంగాఈ బ్యారేజి ప్రాముఖ్యాన్ని తెలియజేసేలా ఈనెల 29న ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు వెల్లడించారు.ఈ సందర్భంగా ఈ బ్యారేజి నిర్మాణంలో పాలు పంచుకున్నవారిని సీఎం నారా చంద్రబాబు నాయుడు సన్మానిస్తారని ఆయన తెలిపారు.