Adireddy Srinivas: నా భార్యను ఘోరంగా ట్రోల్స్ చేశారు.. అసెంబ్లీలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.. ఏమన్నారంటే..?

Ap assembly session 2024: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్  గత వైసీపీ జగన్ పై మండిపడ్డారు. గతంలో లిక్కర్ రేట్లను గురించి మాట్లాడినందుకు ఇష్టమున్నట్లు ట్రోల్స్ చేశారన్నారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Nov 16, 2024, 02:57 PM IST
  • అసెంబ్లీలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే..
  • ట్రోలింగ్ లపై కీలక వ్యాఖ్యలు..
 Adireddy Srinivas: నా భార్యను ఘోరంగా ట్రోల్స్ చేశారు.. అసెంబ్లీలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.. ఏమన్నారంటే..?

Adireddy Srinivas hot comments on ysrcp: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం  రాజ మండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్  మాట్లాడుతూ.. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియంత మాదిరిగా వ్యవహరించిందన్నారు.  అంతే కాకుండా.. గతంలో తన సతీమణి.. దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని ఏపీలో ఉన్న లిక్కర్ ధరల గురించి అసెంబ్లీలో ప్రశ్నించినందుకు ఆమెను ట్రోల్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వైసీపీ కాలంలో మద్యం ఏరులై పారుతుందని, జనాలు కల్తీ మద్యం తాగి చనిపోతున్నారని గత వైసీసీ హయాంలో జరిగిన అసెంబ్లీలో ప్రశ్నించినందుకు తన భార్యను ట్రోల్ చేశారన్నారు. తన భార్యనుట్రోల్స్ చేస్తున్నారని ప్రూఫ్స్ తో సహా.. అసెంబ్లీ లో ఆనాటి స్పీకర్ తమ్మినేనికి అందించిన కూడా చర్యలు తీసుకొలేదన్నారు. ఆయన చైర్ కు అగౌర పర్చేలా ప్రవర్తించారని అన్నారు.

మరోవైపు ఏపీలో దిశ చట్టం తీసుకుని వచ్చి.. ఇష్టాను సారం నిధుల్ని కేటాయించారన్నారు. అంతేకాకుండా.. రాజ మహేంద్ర వరంలో తొలి పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారని, అందులో కూడా తన సతీమణి మొదటి ఫిర్యాదుచేసిందని, దానిపై కూడా అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకొలేదన్నారు. అసలు.. దిశకు కేటాయించిన నిధులు ఏవిధంగా ఖర్చు చేశారో అనేది కూడా ఇప్పటికి కూడా ఎవరికి తెలియని పరిస్థితి అన్నారు.  

ఈ క్రమంలో తమ సతీమణి.. ఆదిరెడ్డి భవానికి అప్పట్లో ఎదురైన ఘటనల గురించి ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. దీనిపై కఠినంగా చర్యలు తీసుకొవాలని కూడా కోరినట్లు తెలుస్తొంది.  మరోవైపు ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, మహిళలపై అసభ్యకరమైన పోస్టులపై చంద్రబాబు సర్కారు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది. పోలీసులు ఎక్కడికక్కడ ట్రోలర్స్ నుఉక్కుపాదంలో అణచివేస్తున్నారు.

Read more: Ramamurthy Naidu: సీఎం చంద్రబాబు ఇంట తీవ్ర విషాదం.. సోదరుడు కన్నుమూత..

 ప్రస్తుతం పోలీసులు మాత్రం.. మహిళల ఆత్మగౌరవానికి ఎవరు ఇబ్బందులు కల్గజేసిన చూస్తు ఊరుకోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ అసెంబ్లీకి అపోసిషన్ హోదా ఇస్తేనే వస్తానని కూడా మాజీ సీఎం మంకు పట్టు పట్టిన విషయం తెలిసిందే. అంతే కాకుండా.. అసెంబ్లీ సమావేశాలపై మాత్రం... వైఎస్ జగన్.. బైట మీడియా సమావేశాలు పెట్టి మరీ సర్కారుకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేస్తు వార్తలలో ఉంటున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News