Punganuru Violence Case: చిత్తూరు జిల్లా పుంగనూరు చంద్రబాబు రోడ్ షో సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు, పోలీసులకు మధ్య జరిగిన హింసాకాండ ఘటనలో 50మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాలతో ఆ రోజు జరిగిన ఘటనకు సంబందించి పోలీసు వాహనాలకు నిప్పంటించి, పోలీసులపై రాళ్ళ దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పలమనేరు డి.ఎస్పీ సుధాకర్ రెడ్డి ఇంచార్జ్, సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ సందర్భంగా సబ్ అడిషనల్ ఎస్పీ కే లక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రోడ్ షోను పుంగనూరు టౌన్ కు మళ్లించడానికి ముందుగా రొంపిచర్లలో 4వ తేదీ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలను ప్రేరేపించాడని పిఏ గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణలో తెలిపాడని అన్నారు. 


ఈ సంఘటనకు సంబంధించి పుంగనూరు టిడిపి ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి (చల్లా బాబు ) ను ఏ1 గా పోలీసులపై  దాడికి పాల్పడి రాళ్లు, బీరు బాటిళ్లు విసిరి గాయపరచి ఒక పోలీసు వాహనం మరియు మరొక టీయర్ గ్యాస్ వాహనం ను నిప్పు పెట్టిన వారిపై వివిధ సెక్షన్ల తో కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.


ఇది కూడా చదవండి : Pawan Kalyan: నేను మంగళగిరిలోనే ఉంటా.. ప్రత్యక్షంగా బరిలోకి దిగుతా: పవన్ కళ్యాణ్‌


మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలో పోలీసులపై జరిగిన దాడిని ఆ రోజు అర్ధరాత్రే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వై. రిశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. పోలీసులపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. వారిపైన చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టంచేశారు. చంద్రబాబు నాయుడు పర్యటన, కార్యక్రమం ప్రకారం పుంగనూరులోనికి రావడానికి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. వారు మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం పుంగనూరులోనికి రాకుండా హైవేపైనే కార్యక్రమం ముగించుకుని చిత్తూరుకు వెళ్ళాల్సి ఉందని.. కానీ చంద్రబాబు రోడ్ షోలో అలా కాకుండా అనుమతికి మించి జరిగింది అని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.


ఇది కూడా చదవండి : Jagan and Jp Meet: జేపీతో జగన్ మంతనాల వెనుక మతలబు ఏంటి, కారణం అదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి