Jagan and Jp Meet: జేపీతో జగన్ మంతనాల వెనుక మతలబు ఏంటి, కారణం అదేనా

Jagan and Jp Meet: ఏపీలో ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైనాట్ 175 లక్ష్యం పెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ చిన్న అవకాశాన్ని వదలదల్చుకోలేదు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 6, 2023, 05:04 PM IST
Jagan and Jp Meet: జేపీతో జగన్ మంతనాల వెనుక మతలబు ఏంటి, కారణం అదేనా

Jagan and Jp Meet: ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ శపధం చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు చెక్ పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణతో జగన్ జరిపిన మంతనాలు రాజకీయంగా సంచలనమయ్యాయి.

విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..అక్కడికి వచ్చిన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణను తనవద్దకు తీసుకురావల్సిందిగా మంత్రి జోగి రమేష్‌కు సూచించారు. వేదికపైకి రాగానే..జగన్ లేచి నిలబడి అభివాదం చేయడమే కాకుండా తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు. చాలా సేపు ఇరువురి మధ్య మంతనాలు జరిగాయి. కార్యక్రమం ముగిసిన తరువాత మరోసారి ఇద్దరూ చర్చించుకున్నారు. ఈ మంతనాలే ఇప్పుడు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. 

జయప్రకాష్ నారాయణకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి జేపీ. ఐఏఎస్ అధికారిగా ఎంతో సర్వీసు వదులుకుని ప్రజాసేవలోకి వచ్చారు. లోక్‌సత్తా పేరుతో పార్టీ స్థాపించి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జేపీ ఆ తరువాత 2014లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా నెగ్గారు. ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న పలు నిర్ణయాల్ని సమర్దించిన జేపీ..కొన్ని నిర్ణయాల్లో మార్పులు ఉండాలని సూచనలు చేశారు.

ఇప్పుడు జేపీ-జగన్ మధ్య జరిగిన సంభాషణ ఏమై ఉంటందనే చర్చ ప్రారంభమైంది. నాడు ఎన్టీఆర్‌తో ఆ తరువాత చంద్రబాబు ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్న జేపీతో జగన్ మంతనాల వెనుక పెద్ద కారణమే ఉంటుందనే చర్చ మొదలైంది. జేపీ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరకపోయినా వైసీపీకు మద్దతిస్తారనే వాదన కూడా ఉంది. ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా టీడీపీకు ఇది షాక్ కల్గించే అంశం. 

Also read: Ap Executive Capital: విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ మార్గం సుగమం కానుందా, సుబ్బారెడ్డి వ్యాఖ్యలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News