ALL INDIA GATE 2022: కృషి పట్టుదల ఉంటే చాలు.. చదువుల్లో అన్ని రంగాల్లో మనిషి ఎమైన చెయ్యగలడు. "కృషి ఉంటే మనుషు రుషులవుతారు, మహాపురుషులౌతారు" అన్నారు పెద్దలు. ఆమాటలను నిరూపించాడో ఓ పెద్దాయన. ఉన్నత చదువులకు వయసు అడ్డం కాదని నిరూపించాడు అనంతపురం నగరానికి చెందిన వి.సత్యనారాయణరెడ్డి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన ఉద్యోగం చేస్తూ కూడా చదువును ఒదులుకోలేదు. నిత్యం జాబ్‌ చేస్తూ.. చదువుపై శ్రద్ధ చూపేవాడు సత్యనారాయణరెడ్డి. ఏ మాత్రం తన గమ్యాన్ని కోల్పోకుండా పట్టుదలతో గేట్‌ పరీక్షలో జాతీయస్థాయిలో 140వ ర్యాంకు సాధించారు. ఉద్యోగ విరమణ  తరువాత కూడా ఉన్నత చదువులు అభ్యసించేవారు ఎక్కడో ఒక్కరుంటారు. ఇంజినీరుగా ఉద్యోగ విరమణ చేసిన వి.సత్యనారాయణరెడ్డి తరువాత జేఎన్‌టీయూలో ఎంటెక్‌ చేశారు.


ఇప్పుడు 64 ఏళ్ల వయసు గల వ్యక్తికి జాతీయ స్థాయి గేట్‌ పరీక్షలో 140వ ర్యాంకు సాధించడం విశేషం. ఇంతముందు పంచాయతీరాజ్‌ శాఖలో ఇంజినీరుగా 39 ఏళ్లు పనిచేసి విశేష సేవలందించారు సత్యనారాయణరెడ్డి. DEEగా 2018లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన 2019లో JNTU సివిల్‌ విభాగంలో ఎంటెక్‌లో చేరి 2022లో పూర్తి చేసి మంచి మర్కులు పొందారు. 2022 గేట్‌ పరీక్షలోని జియోమోటిక్స్‌ ఇంజినీరింగ్‌ పేపరులో 140వ ర్యాంకు సాధించారు. 


ఆయన వయసు ఇప్పుడు 64 సంవత్సరాలు అయిన పట్టు వదలకుండా ర్యాంక్‌ సాధించడంతో పలువురు కొనియాడుతున్నారు. వి.సత్యనారాయణరెడ్డికి ఇద్దరు కుమారులు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయితే ఆయన గేట్‌ సాధించిన గేట్‌ ప్రవేశానికి 3 సంవత్సరాలపాటు అవకాశం ఉంటుందని, కుటుంబసభ్యులతో చర్చించి బాంబే లేదా రౌర్కెలాలోని ఐఐటీలో జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (GIS), రిమోట్‌ సెన్సింగ్‌ కోర్సులో చేరాలని భావిస్తున్నట్లు అయన తెలిపారు. ఎదైనా ఒక లక్ష్యం సాధించాలంటే ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు.


Also Read: China Corona Update: చైనాలో కొవిడ్​ కల్లోలం- రెండేళ్ల తర్వాత మరణాలు నమోదు!


Also Read: SS Rajamouli: ఇంకో 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా ఉంది.. అంతకుమించి కామెడీ ఉంటుంది: రాజమౌళి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook