Gold Rate Today: కొత్త సంవత్సరం వేళ..తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందో తెలిస్తే కొనేస్తారు

Gold Rate Today: కొత్త సంవత్సరం వేళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. నేడు జనవరి 1వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్నటితో పోల్చితే నేడు స్థిరంగానే ఉన్నాయని చెప్పవచ్చు. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,250 దగ్గర ట్రేడ్ అవుతోంది. 
 

1 /6

Gold Rate Today: న్యూ ఇయర్ సందర్భంగా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. నేడు జనవరి 1వ తేదీ బుధవారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే నిన్నటితో పోల్చితే స్థిరంగానే ఉన్నాయని చెప్పవచ్చు. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,250 దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు ఈ ఏడాది తగ్గుతాయా లేదా పెరుగుతాయా? బులియన్ మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.   

2 /6

కొత్త సంవత్సరం బంగారం ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టడమే అని చెప్పవచ్చు.  జనవరి చివరి వారంలో డోనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం తీసుకున్న చర్యలు బంగారం ధరలు తగ్గే విధంగా ఉండవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

3 /6

బంగారం ధరలు డాలర్ విలువ ఆధారంగా హెచ్చుతగ్గులకు  లోనవుతుంటాయి. ప్రస్తుతం డాలర్ విలువ భారీగా పెరిగింది. ఒక డాలర్ విలువ 85 రూపాయలకు పైగానే ఉందని చెప్పవచ్చు.  ఎందుకంటే డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు భారీగా తగ్గుతాయి.  

4 /6

 డాలర్ విలువ పెరిగే కొద్దీ ఇన్వెస్టరు తమ పెట్టుబడులను అమెరికా ఫెడరల్ జారీ చేసే డాలర్ బాండ్లలో ఇన్వెస్ట్ పెడుతుంటారు. ఫలితంగా బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి దీంతో బంగారం ధరలు భారీగా దిగి వస్తాయి.

5 /6

బంగారం ధరలు కొత్త ఏడాది పెరిగే అవకాశం ఉందని కొంతమంది మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అమెరికాలో మాంధ్యం నీడలు తగ్గుముఖం పట్టలేదు. ట్రంప్ తీసుకునే రక్షణాత్మక వైఖరి వల్ల ఎంత మేరకు రికవరీ అవుతుందో  చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బంగారం ధరలు కొత్త ఏడాది పెరిగే అవకాశం ఉందని ఓ అంచనా వెలువడుతుంది.  

6 /6

 ఒకవేళ అంతర్జాతీయంగా ఉద్రిక్తత మార్కెట్లలో పరిస్థితిలు స్థిరంగా కొనసాగినట్లయితే బంగారం ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది