విశాఖపట్నం  రసాయన కంపెనీలో చెలరేగిన గ్యాస్ లీకేజీ వ్యవహారం స్థానికంగా పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఇప్పటి వరకు గ్యాస్ లీకేజీ ఘటన కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరుకుంది. ఇప్పటికీ పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .. వారిని పరామర్శించేందుకు విశాఖ చేరుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్ కెమికల్ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున జరిగిన గ్యాస్ లీకేజీ 8 మందిని బలి తీసుకుంది. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇంకా పలు ఆస్పత్రుల్లో 800 మంది శ్వాసకోశ ఇబ్బందులతో చికిత్స తీసుకుంటున్నారని వివరించారు. ఐతే ప్రస్తుతం గ్యాస్ లీకైన కంపెనీ పరిసరాల్లో వాతావరణం అంతా సాధారణమైందని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. కంపెనీలో గ్యాస్ ను తటస్థీకరించడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కోరారు. 


[[{"fid":"185309","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇవాళ ఉదయం నుంచి ఆస్పత్రులకు తరలించిన వారిలో కొంత మందిని డిశ్చార్జి కూడా చేశారని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. గ్యాస్ పీల్చుకున్న వారు ఎక్కువ నీరు తాగడమే విరుగుడు అని చెప్పారు. ఐతే తమకేదో జరిగిపోతుందన్న ఆందోళనే అందరినీ ఎక్కువగా భయపెడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎవరూ  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.


మరోవైపు గ్యాస్ లీకేజీకి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై దర్యాప్తు చేస్తామన్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో విచారిస్తామని తెలిపారు. ప్రమాదవశాత్తూ ఘటన జరిగిందా..? సిబ్బంది తప్పిదం ఏమైనా ఉందా..? అనేది విచారణలో తెలుస్తుందన్నారు. సాధారణ విచారణ  తర్వాత కంపెనీపై కేసులు పెడతామని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..