కరోనాను జయించిన 85ఏళ్ల వృద్ధురాలు
కరోనా వైరస్ కేసులతో పాటు మరణాలు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో మంగళవారం వరకు 757 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ కేసులతో పాటు మరణాలు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో మంగళవారం వరకు 757 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో చికిత్స అనంతరం 96 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. తాజాగా మంగళవారం కోవిడ్ టెస్టుల్లో నెగటివ్ రావడంతో అయిదురిని డిశ్ఛార్జ్ చేసి ఇంటికి పంపించారు. అయితే ఇందులో 85 ఏళ్ల వృద్ధురాలు ఉండటం గమనార్హం. Photos: బాత్‌టబ్‌లో నటి హాట్ ఫొటోషూట్
మంగళవారం నాడు అనంతపురం జిల్లాకు చెందిన అయిదుగురు పెషెంట్లు రికవరీ అయ్యారు. ఇందులో 85ఏళ్ల పేషెంట్ కూడా ఉన్నారని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. చికిత్స అనంతరం కరోనా నెగటివ్‌గా తేలిన పేషెంట్లను ఇంటి వద్ద డ్రాప్ చేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఫలితాలు ఇలా మెరుగ్గా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!
కాగా, జిల్లాలవారీగా చూస్తే కర్నూలు 184, గుంటూరు 158 కేసులతో కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దక్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ కిట్లతో ఏపీలో కరోనా టెస్టులు వేగవంతం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!