Attempt to destroy NTR statue: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ ప్రధాన రహదారి పక్కనే ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్​న్​టీఆర్​ విగ్రహాన్ని ఓ వ్యక్తి సుత్తితో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దీనితో టీడీపీ కార్యకర్తలు స్థానికంగా ఆందోళనకు దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దుర్గిలో 144 సెక్షన్​..


స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు చేరుకుని విగ్రహ ధ్వంసానికి యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తి మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్​ యలమంద కుమారుడు కోటేశ్వర్​ రావుగా గుర్తించారు పోలీసులు. పోలీసులు చేరుకునే లోపే.. విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. దీనితో స్థానికంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సమీప ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు దుర్గికి చేరుకుంటున్నారు.


ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు దుర్గిలో 144 సెక్షన్​ విధిచారు. జిల్లా వ్యాప్తంగా పలువురు కీలక నేతలను హౌస్​ అరెస్ట్​ చేశారు పోలీసులు. అయినప్పటికీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.


ఘనటపై లోకేశ్​ ఆగ్రహం..


ఈ ఘనటపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ స్పందించారు. శెట్టిపల్లి కోటేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడటమే కాకుండా.. ఇప్పుడు ఏకంగా మహానియుల విగ్రహాలు పగలగొడుతున్నారని విమర్శించారు.



Also read: Vizag RK beach: విహారయాత్రలో విషాదం..ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఐదుగురి గల్లంతు..రెండు మృతదేహాలు లభ్యం


Also read: Andhra Pradesh News: ఏపీలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook