Vizag RK beach: విహారయాత్రలో విషాదం..ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఐదుగురి గల్లంతు..రెండు మృతదేహాలు లభ్యం

Visakha RK beach: విశాఖ ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతయ్యారు. వీరంతా ఒడిశాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2022, 05:59 PM IST
  • వైజాగ్ ఆర్కే బీచ్‌లో ఐదుగురు గల్లంతు
  • ఇద్దరు మ‌ృతి, మరో ముగ్గురు గల్లంతు
  • వీరంతా ఒడిశా వాసులుగా గుర్తింపు
Vizag RK beach: విహారయాత్రలో విషాదం..ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఐదుగురి గల్లంతు..రెండు మృతదేహాలు లభ్యం

Visakha RK beach: ఏపీలో విషాదం చోటుచేసుకుంది.  విశాఖ ఆర్కే బీచ్‌లో (Visakha RK beach) స్నానానికి దిగి ఐదుగురు గల్లంతయ్యారు. విహారయాత్ర కోసం ఆదివారం మధ్యాహ్నం ఒడిశాకు (odisha) చెందిన నలుగురు యువకులు, ఓ యువతి నగరానికి వచ్చారు. బీచ్‌లో సరదాగా గడిపారు. తర్వాత స్నానానికి దిగి అలల ధాటికి కొట్టుకుపోయారు. ఘటన జరిగిన అరగంటలోనే యువతి, యువకుడి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో ముగ్గురి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

గజ ఈతగాళ్లు, లైఫ్‌ గార్డ్స్‌ను తీసుకొచ్చి..గాలింపు మెుదలపెట్టారు అధికారులు. మూడో పట్టణ సీఐ కోరాడ రామారావు నేవీ, మెరైన్‌ సిబ్బందికి సమాచారం అందజేశారు. గల్లంతైన వారి కోసం స్పీడ్‌ బోట్లు, హెలికాప్టర్‌ ద్వారా గాలించే అవకాశం ఉంది. ఒడ్డుకు వచ్చిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వీరంతా న్యూఇయర్ వేడుకలు (New year Celebrations 2022) జరుపుకోవడానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీచ్ లోకి ఇతరులను దిగనివ్వకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. 

Also Read: New Year 2022: విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు- సెక్షన్ 144 అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News