మాజీ సీఎం చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారని చంద్రబాబుకు వ్యతిరేకంగా రిపబ్లిక్ పార్టీ నేత బోరుగడ్డ అనికుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో  పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ లాంటి జనాకర్షణ పథకాలతో జానాల వ్యక్తిగత ఖాతాలో నగదు జామా చేసి ఓటర్లను ప్రభావితం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులు దుబార ఖర్చుచేసిందుకు చంద్రబాబు తన సొంత నిధులతో ఈ లోటును పూడ్చాలని కోరారు. మాజీ సీఎం చంద్రబాబుపై దాఖలైన ఈ  పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ....కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసుల పర్వం మొదైలనట్లేనా..?


మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ధర్మపోరాట దీక్షల పేరుతో చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారంటూ  దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. దీనిపై కూడా త్వరలోనే విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా మున్ముందు మరికొన్ని కేసులు దాఖలయ్యే అవకాశముందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా తాజా పరిణామాలు.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపనై కేసులు పర్వం  మొదైలనట్లుగా సూచిస్తున్నాయి. మరి దీన్ని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది