Nallamala Forest: గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృతి
గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృత్యువాత పడింది. ఈ ఘటన నంద్యాల- గుంటూరు మార్గంలోని చిన్నటన్నెల్ వద్ద చలమ రేంజ్ పరిధిలో చోటుచేసుకుంది.
Nallamala Forest: ఏపీలోని కర్నూలు జిల్లా(kurnool district) నంద్యాల నల్లమల అడవుల్లో(Nallamala Forest) గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గం చలమ రేంజ్ పరిధిలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న చలమ రేంజ్ అటవీ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నంద్యాల(Nandyala) వైపు వస్తున్న గూడ్స్ రైలు(Goods train) ఢీకొట్టడం వల్లే పెద్దపులి(Tiger) చనిపోయినట్లు తెలుస్తోంది.
పులి కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని.. కార్యాలయానికి తరలించారు. కాగా..ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు(Forest Officials) తెలిపారు. అంతకు ముందు కూడా పలు ప్రాంతాల్లో వాహనాలు ఢీకొని అటవీ జంతువులు మరణించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో పులుల సంచారం పెరిగినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Tirumala: రేపు ఉదయం వరకు తిరుమల ఘాటు రోడ్డుల మూసివేత
పెద్దపులి సంచారం...భయాందోళనలో ప్రజలు
తెలంగాణ(Telangana)లోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. తాడ్వాయి అటవీ ప్రాంతం నుంచి కరకగూడెం అడవుల్లోకి పెద్దపులి ప్రవేశించినట్లు వారు స్పష్టం చేశారు. రఘునాదపాలెం అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు పశువులను మేపుతుండగా.. పెద్దపులి(tiger) వారి కంట పడటంతో అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. పులి పాదముద్రలను పరిశీలించారు. వాటి ఆధారంగా పులి సంచారాన్ని నిర్ధారించారు. ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook