Ketu Transit In Leo Lucky Signs: గ్రహాల రాశి మార్పు 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే, ఈ ఏడాది కేతువు రాశి మారుతున్నాడు. ఈ నేపథ్యంలో రెండు రాశులకు రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు బంపర్ లాభాలు పొందుతారు. కేతువు వల్ల సుడి తిరిగి రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు కోరుకున్న లైఫ్ 2025 లో కేతువు వల్ల కలుగుతుంది. కేతువు వల్ల అశుభాలు మాత్రమే కాదు శుభం కూడా జరుగుతుంది. అయితే, ఈ ఏడాది అదృష్టం సుడి తిరుగుతున్న రాశులు ఏవో తెలుసుకుందాం.
రాహు కేతువులు నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. జాతకంలో ఈ గ్రహాలు ఉంటే కంగారు పడతారు. ఏ పని కాదు, పెళ్లి కాదు అని బాధపడతారు. అయితే, రాహు కేతువులు మన జాతకంలో ఉండే అభివృద్ది మందగిస్తుంది. ఈ ఏడాది కేతువు సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో రెండు రాశులకు రాజయోగం పట్టబోతుంది.
మీన రాశి.. కేతువు వల్ల విశేష యోగం పట్టబోతున్న రాశి. ఈ రాశివారు ఈ ఏడాది చక్రం తిప్పుతారు. వీరికి ఆర్థిక ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. కేతువు వల్ల కెరీర్ మందగించడం కాదు కొన్ని సందర్భాల్లో పుంజుకుంటుంది కూడా. మీన రాశివారు కోరుకున్న భాగస్వామి కూడా ఈ ఏడాది కలుస్తారు.
మిథున రాశి.. మిథున రాశికి కూడా కేతువు వల్ల అశేష ప్రయోజనాలు పొందుతారు. పోటీ పరీక్షలు రాసేవారికి కూడా శుభ యోగం అంతేకాదు అప్పులు తీరి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. మిథున రాశి వారికి కూడా ఈ ఏడాది సువర్ణ యోగం అని చెప్పాలి. కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది.
ఈ రెండు రాశులు కేతు గ్రహం వల్ల శుభం కలుగుతుంది. కన్య రాశి నుంచి సింహ రాశిలోకి ఈ ఏడాది కేతు గ్రహం తిరోగమనం చెందుతుంది. శని ప్రభావం రెండున్నరేళ్లు ఉంటే కేతు గ్రహం 18 నెలల ప్రభావం ఉంటుంది.
అయితే, కొన్ని తిరోగమనాలు కొన్ని రాశులకు శుభాన్ని ఇస్తే మరికొన్ని రాశులకు అశుభాన్ని ఇస్తాయి. గ్రహాల శుభ సమయంలో ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అప్పుల నుంచి బయటపడే మార్గం కూడా దొరుకుతుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని పనులు కూడా పూర్తవుతాయి.