ఏపీ రాజదాని ( Ap capital ) అమరావతి భూకుంభకోణం ( Amaravathi land scam ) పై విచారణ వేగం పుంజుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ( Insider trading ) ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదైంది. రాజధాని ప్రాంతంలో ఎవరెవరు..ఎప్పుడు భూములు కొనుగోలు చేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గత ప్రభుత్వం ప్రకటించిన అమరావతి ప్రాంతపు భూ కుంభకోణంపై దర్యాప్తు ఇప్పుడు ముమ్మరమైంది. ఈ కుంభకోణంపై ఏసీబీ ( ACB Case ) తాజాగా కేసు నమోదు చేసింది. ఈ ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందనేది ముందుగానే తెలుసుకుని ఎవరెవరు ఏ మేరకు భూములు కొనుగోలు చేశారనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. రాజధాని ప్రకటనకు ముందే అప్పటి అధికార పార్టీకు చెందిన కొందరు నేతలు, ప్రముఖులు దాదాపు 4 వేల 75 ఎకరాలు కొనుగోలు చేశారనేది ఆరోపణగా ఉంది.  ఇందులో 9 వందల అసైన్డ్ భూముల్ని దళితుల్నించి బలవంతంగా కొన్నట్టు కూడా ఆరోపణ ఉంది. 


ఆరోపణలు రావడానికి ప్రధాన కారణం..ఈ భూములు కొనుగోలు చేసినవారిల తెల్లరేషన్ కార్డున్నవారు ఉండటం, టీడీపీ నేతలు ఉండటమే. టీడీపీ నేతలకు వాటాలున్న కంపెనీలు కూడా భూములు కొనుగోలు చేశాయి. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డ వారిలో పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్‌, లంకా దినకర్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌, పుట్టా మహేష్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. 


కేసు వివరాల్ని పరిశీలిస్తే...సెప్టెంబర్‌ 3వ తేదీ 2015న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాజధాని ప్రకటన ( Capital Announcement ) చేశారు. అయితే అంతకు ముందే జూన్ 1వ తేదీ 2014 నుంచి డిసెంబర్ 31, 2014 వరకు భూముల కొనుగోళ్లు జరిగాయని.. 1977 అసైన్డ్ భూముల చట్టం, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించారని ఇప్పటికే నిర్ధారణైంది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తింపు జరిగినట్లు తేలింది. లాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు తెలుస్తోంది. Also read: AP Minister: మంత్రి ముత్తంశెట్టికు కరోనా పాజిటివ్