Achyuthapuram Gas Leakage: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి గ్యాస్ లీకేజీ కలకలం... తప్పిన ముప్పు..
Achyuthapuram Gas Leakage: అచ్యుతాపురం సెజ్‌లో మరో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. సెజ్‌లో మరోసారి విషవాయువులు లీకయ్యాయి.
Achyuthapuram Gas Leakage: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ (స్పెషల్ ఎకనమిక్ జోన్)లో మరోసారి విష వాయువులు లీకయ్యాయి. దుస్తుల పరిశ్రమ అయిన బ్రాండిక్స్ కంపెనీ సమీపంలో విషవాయువులు వ్యాపించినట్లు చెబుతున్నారు. దీనిపై బ్రాండిక్స్ కంపెనీ ప్రతినిధులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. ఇవాళ ఆదివారం (జూన్ 5) కావడంతో సిబ్బంది విధులకు రాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న కంపెనీల్లో దాదాపు 20 వేల మంది మహిళలు ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నారు. రెండు రోజుల క్రితం కూడా అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువులు లీకయ్యాయి. ఈ ఘటనలో సుమారు 200 మంది ఉద్యోగినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అందరినీ అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ లీకైంది బ్రాండిక్స్ కంపెనీ నుంచా మరో కంపెనీ నుంచా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతలోనే బ్రాండిక్స్ కంపెనీ సమీపంలో మరోసారి విష వాయువులు లీకవడం తీవ్ర కలకలం రేపుతోంది.
అచ్యుతాపురం సెజ్‌లో వరుస గ్యాస్ లీకేజీ ఘటనలతో సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన గ్యాస్ లీకేజీ.. ఏ కంపెనీ నుంచి జరిగిందనేది ఇంకా తేల్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఘటనపై కమిటీ వేసినప్పటికీ ఇప్పటికీ వివరాలు తెలియకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
కాగా,రెండేళ్ల క్రితం విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకేజీ ఘటన దాదాపు 12 మందిని బలితీసుకున్న సంగతి తెలిసిందే. తెల్లవారుజామున పరిశ్రమ నుంచి లీకైన గ్యాస్ సమీపంలోని వెంకటాపురానికి వ్యాపించింది. అంతా గాఢ నిద్రలో ఉన్న వేళ జరిగిన ఈ ఘటన అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కొంతమంది నిద్రలోనే ప్రాణాలు విడవగా.. మరికొందరు శ్వాస ఆడక గ్రామం నుంచి పరుగులు తీస్తూ పడిపోయారు.కేవలం మనుషులే కాదు పక్షులు, మూగజీవాలు కూడా బలైపోయాయి.చెట్లు పూర్తిగా మాడి మసైపోయాయి.గ్యాస్ లీకేజీ దుష్ప్రభావం కారణంగా ఇప్పటికీ ఆ గ్రామాల ప్రజలను అనారోగ్యం వెంటాడుతూనే ఉంది.
Also Read: APPLE iphone 13: నెలకు కేవలం రూ.2341కే ఐఫోన్ 13.. బై బ్యాక్ ఆఫర్ కూడా..
Also Read: Chintamaneni Prabhaker: టీడీపీ నేత చింతమనేని హత్యకు షూటర్? ప్లాన్ చేసింది ఎవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook