sonu sood responds over farmer story: ఆయన సినిమాల్లో విలన్ అయినప్పటికీ.. ఇప్పుడు అందరికీ హీరోగా మారాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కూలీలు ఇళ్లకు వెళ్లేందుకు, వారికి భోజన వసతులు కల్పించిన ఆపద్భాందవుడు..సోనూసూద్ ( Sonu Sood ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసును గెలుచుకున్నారు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్రాజపల్లిలో కాడెద్దులుగా మారి కుమార్తెలే తండ్రికి పొలం పనుల్లో సాయపడటం చూసి చలించిన సోనూసూద్ వెనువెంటనే ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో సినీ నటుడు సోనూ‌సూద్‌కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( N. Chandrababu Naidu ) ఫోన్ చేసి అభినందించినట్లు ట్వీట్ కూడా చేశారు. Also read: AP: హామీ ఇచ్చిన గంటల్లోనే ట్రాక్టర్ అందించిన సోనూ సూద్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించడాన్ని చంద్రబాబు సోనూను అభినందించారు. సోనూసూద్ స్పందన అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆ రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువుల బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు ట్వీట్‌కు స్పందించిన సోనూసూద్.. ఇలా ట్విట్ చేశారు. మీ అభినందనలకు కృతజ్ఞతలు..మీలాంటి వారిచ్చే స్ఫూర్తితోనే.. పేదవారికి సహాయం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు వస్తారు. మీరిలా స్ఫూర్తినింపుతూనే ఉండాలి సార్. త్వరలో మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను.. అంటూ సోనూసూద్ రీట్విట్ చేశారు.  



ఇదిలాఉంటే.. సోనూసూద్ సాయంపై ప్రతీఒక్కరూ అభినందిస్తున్నారు. ఆయన రీల్ హీరో కాదని రియల్ హీరో అంటూ తెలుగు ప్రజలు, ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కొనియాడుతున్నారు.  Also read: Sonu Sood: కాడెద్దులుగా రైతు కూతుళ్లు.. చలించిపోయిన సోనూ సూద్