Sonu Sood: కాడెద్దులుగా రైతు కూతుళ్లు.. చలించిపోయిన సోనూ సూద్

రైతు కుమార్తెలు కాడెద్దులుగా మారి పోలం దున్నటాన్ని చూసిన నటుడు సోనూ సూద్ చలించిపోయాడు. మీకు ట్రాక్టర్ పంపుతానని హామీ (Sonu Sood Helps Madanapalle Farmer) ఇస్తూ ట్వీట్ చేశాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Jul 26, 2020, 05:19 PM IST
Sonu Sood: కాడెద్దులుగా రైతు కూతుళ్లు.. చలించిపోయిన సోనూ సూద్

లాక్‌డౌన్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ (Sonu Sood) వలస కార్మికులకు చేసిన సాయం దేశ వ్యాప్తంగా అతడి మంచితనాన్ని తెలిసేలా చేసింది. ఇతర రాష్ట్రాలకు పొట్టచేతపట్టుకుని వెళ్లిన వేలాది మంది కార్మికులను క్షేమంగా తిరిగి వెళ్లడానికి సాయం చేసి హీరో అయ్యాడు. తాజాగా ఏపీ రైతు కుటుంబం విషయంలో స్పందించిన సోనూ సూద్ (Sonu Sood Helps AP Farmer) తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు.  బతకాలని లేదు, చచ్చిపోతానంటూ నటి పోస్ట్.. ఆపై!

ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన కుటుంబం లాక్‌డౌన్, ఆ తర్వాత పరిస్థితులతో ఉపాధిని కోల్పోయింది. దీంతో సొంతూరుకు వచ్చి వ్యవసాయం చేయాలనుకున్నారు. అయితే పొలం దున్నేందుకు ఎద్దులు లేవు, అద్దెకు తెచ్చేందుకు డబ్బులు లేని కారణంగా ఆయన ఇద్దరు కుమార్తెలు కాడెద్దులుగా మారడం సోషల్ మీడియాను కదిలించింది. ఇద్దరు యువతులు కాడెద్దులుగా పనిచేస్తూ పొలం దున్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. COVID19 Medicine: ‘రెమ్‌డెసివర్‌’ అక్కడ మాత్రమే విక్రయాలు

ఈ వీడియో చూసిన సోనూ సూద్ చలించిపోయాడు. తొలుత మీకు కాడెద్దులు అవసరం కానీ డబ్బులు లేవు, అందుకే ఇలా చేస్తున్నారంటూ సానుభూతి తెలిపాడు. మీకు ఓ జత ఎద్దులు పంపుతానని హామీ (Sonu Sood Helps Madanapalle Farmer) ఇస్తూ ట్వీట్ చేశాడు. కరోనా కష్టకాలం, లాక్‌డౌన్‌లు కొందరి నిజ స్వరూపం బయటపెడితే, కొందరి వ్యక్తిత్వాన్ని అందరూ గుర్తించేలా చేసింది. హాట్ ఫొటోలతో కవ్విస్తున్న హార్ట్ ఎటాక్ బ్యూటీ

మీకు ఎద్దులు కాదు, ట్రాక్టర్ పొందెందుకు అర్హులు. మీకు నేను సాయంత్రానికల్లా ట్రాక్టర్ పంపిస్తానని మరో ట్వీట్ చేశాడు సోనూ సూద్. ఆ రైతు టమోటా పండించడానికి పొలం దున్నుతుండగా, భార్య విత్తనాలు చల్లుతున్న వీడియో ఎందరినో కదిలించింది, కానీ స్పందించింది మాత్రం మనసున్న మారాజు సోనూ సూద్. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News