Entrance exams: ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) ఉధృతి కారణంగా కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నీంటిని ప్రభుత్వం ( AP Govt ) వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) ఉధృతి కారణంగా కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నీంటిని ప్రభుత్వం ( AP Govt ) వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీ సెట్ లాంటి 8 ప్రవేశ పరీక్షలన్నీంటిని వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ( Adimulapu Suresh ) సోమవారం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో 8 ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదలచేశామని, దీనిపై సీఎం సమీక్షించి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. Also read: Andhra Pradesh: రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు
సెప్టెంబరు మూడో వారానికి ఈ ఎనిమిది ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. అయితే ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. జాతీయ పరీక్షలకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆన్‌లైన్ కోర్సుల విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. Also read: Heavy rain: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన