Chandrababu Oath: ప్రమాణస్వీకారంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుంది.. చంద్రబాబు అనే నేను
All Set Chandrababu Naidu Oath As CM Ceremony VVIPs And Arrangements: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం ఏపీలో పండుగ వాతావరణం అలుముకుంది. కాగా ప్రమాణస్వీకారంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో పూర్తి షెడ్యూల్ ఇదే.
Chandrababu Naidu Oath As CM: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి కొన్ని నిమిషాలే మిగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతున్నది. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుకతో ఏపీలో పండుగ వాతావరణం అలుముకుంది. ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు తరలిరానున్నారు. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టు వీవీఐపీల తాకిడితో సందడి నెలకొంది.
Also Read: Chandrababu Oath: పండుగలా బాబు ప్రమాణం.. షా, చిరు, రజనీకాంత్ రాక.. వరుస కట్టిన ప్రముఖులు
వేదిక: గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి హెచ్‌సీఎల్ పక్కన జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పొట్లూరి బసవరావుకి సంబంధించిన స్థలంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
ముహూర్తం: బుధవారం ఉదయం 11.27 గంటలకు
అతిథులు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, కేంద్ర మంత్రులు జితన్ రామ్ మంజి, చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరీ, జయంత్ చౌదరి, అనుప్రియా పాటెల్, రామ్ దాస్ అథవాలే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పాటెల్, మాజీ గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Also Read: Chandrababu Revanth Reddy: చంద్రబాబు, రేవంత్ మధ్య ఏం జరిగింది? ఎందుకు ఆహ్వానం పంపలేదు
ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు కీలకమైన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎన్నో ఆశలతో ప్రజలు ఇచ్చిన తీర్పు నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. కొత్త ఆశలతో ఉన్న ప్రజలకు ప్రమాణస్వీకారం రోజే కూటమి ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. దీంతో ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. 14 ఎకరాల్లో ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా భారీ షెడ్లు నిర్మించారు. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీస్ బందోబస్తు చేపట్టారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడుతుండడంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణం చేసిన సమయంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చేందుకు సిద్ధమయ్యారు. మిఠాయిలు పంచడం, పలు సేవా కార్యక్రమాలు చేయాలని ప్రణాళిక రచించుకున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. ఈ మేరకు పోలీస్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్టణం, చెన్నై, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ముందే గ్రహించి ఇతర మార్గాల్లో రాకపోకలు సాగించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
- విశాఖ పట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లించారు.
- విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లి వచ్చే వాహనాలను కత్తిపూడి నుంచి ఒంగోలు వైపు దారి మళ్లింపు చేశారు.
- చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలు ఒంగోలు నుంచి రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం - లోసర్ బ్రిడ్జి - నరసాపురం - అమలాపురం - కాకినాడ - కత్తిపూడి మీదుగా విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లాల్సి ఉంది.
- బుడంపాడు నుంచి తెనాలి- పులిగడ్డ - మచిలీపట్నం - లోసర్ బ్రిడ్జి - నర్సాపురం - కాకినాడ - కత్తిపూడి వైపు కూడా మళ్లింపు చేశారు.
విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు
- గామన్ బ్రిడ్జి - దేవరపల్లి - జంగారెడ్డిగూడెం - అశ్వరావుపేట - ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపునకు దారి మళ్లింపు
- భీమడోలు- ద్వారకాతిరుమల - కామవరపుకోట - చింతలపూడి నుంచి ఖమ్మం వైపు దారి మళ్లించారు.
- ఏలూరు బైపాస్ నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వరావుపేట - ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వాహనాల దారి మళ్లింపు
- ఏలూరు బైపాస్ - చింతలపూడి నుండి సత్తుపల్లి మీదుగా హనుమాన్ జంక్షన్ - నూజివీడు, మైలవరం - ఇబ్రహీంపట్నం - నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు.
హైదరాబాద్ నుండి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు
- నందిగామ - మధిర - వైరా - సత్తుపల్లి - అశ్వరావుపేట - జంగారెడ్డిగూడెం - దేవరపల్లి - గామన బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు మళ్లింపు చేశారు.
- ఇబ్రహీంపట్నం - మైలవరం - నూజివీడు - హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు వాహనాల మళ్లింపు.
- రామవరప్పాడు - నున్న - పాముల కాలువ - వెలగలేరు - జి.కొండూరు - మైలవరం - నూజివీడు - హనుమాన్ జంక్షన్ - ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు వాహనాలు మళ్లించారు.
- విజయవాడ నుంచి ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు - తాడిగడప - కంకిపాడు - పామర్రు - గుడివాడ నుంచి భీమవరం వైపు వాహనాలను దారి మళ్లించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook