Narendra Modi AP Visit: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన రెండోసారి ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానుండగా ఈ పర్యటనకు ఏపీ ప్రభుత్వం కనీవినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రేపు విశాఖపట్టణంలో త్రిమూర్తులు రోడ్‌ షో చేపట్టనున్నారు. ఒకే వాహనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కనిపించనున్నారు. ఈ మేరకు నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ఏర్పాట్లు.. సమయపాలన వివరాలు తెలుసుకుందాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Sharmila: 'ఆరోగ్య శ్రీకి సీఎం చంద్రబాబు మంగళం పాడడం తగదు'


విశాఖలో భారీ ఏర్పాట్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖపట్టణంలో పర్యటిస్తారు. మొదట రోడ్ షో చేపడతారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రోడ్‌ షోలో ప్రధానితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. రోడ్ షో, సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, జనసేన పార్టీ నేతలతో రోడ్ షో, సభ విజయవంతంపై చర్చించారు

Also Read: Modi AP Tour: 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. వరాల వర్షం కురిపించేనా..?


షెడ్యూల్‌ ఇదే!
రేపు విశాఖకు ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి వస్తారు.
సాయంత్రం 4:15 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకుంటారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు.
సాయంత్రం 4:45 గంటకు విశాఖలోని వెంకటాద్రి వంటిల్లు నుంచి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో కలిసి రోడ్ షో ప్రారంభం
సాయంత్రం 6 గంటలకు బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగం
సాయంత్రం 6.45 గంటలకు ఏపీ నుంచి తిరుగు ప్రయాణం


హోంమంత్రి రథంపైనే
ప్రధాని నరేంద్రమోదీ రోడ్ షోకు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రచార రథం సిద్ధం చేశారు. ఆమె ఉపయోగించిన ప్రచార రథంలోనే త్రిమూర్తులు రోడ్‌ షో చేపట్టనున్నారు. ప్రచార రథాన్ని అనిత మరమ్మతులు చేయించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ ఫొటోలతో ఆకర్షణీయంగా వాహనాన్ని రూపొందించారు. విశాఖలో రేపు వెంకటాద్రి వంటిల్లు నుంచి ఈ ప్రచార రథం నుంచే  మోడీ రోడ్ షో లో ప్రజలకు అభివాదం చేయనున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.