Ex MLA Neeraja Reddy: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి కన్నుమూత
Neeraja Reddy Passed Away: కర్నూల్ జిల్లాలో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలిపోవడంతో పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఓ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Former MLA Neeraja Reddy Died in a Road Accident: కర్నూల్ జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి కర్నూల్ వస్తుండగా.. గద్వాల జిల్లా బీచుపల్లి దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలి బోల్తా కొట్టింది. కారు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నీరజారెడ్డిని కర్నూల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె బీజేపీ ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1996లో నీరజా రెడ్డి భర్త, మాజీ ఎమ్మెల్యే పాటిల్ శేశిరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. భర్త మరణంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. 2004లో పత్తికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే పొత్తుల్లో భాగంగా సీపీఐ అభ్యర్థికి సీటు కేటాయించాల్సి వచ్చింది. అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్వీ సుబ్బారెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. 40,783 ఓట్లు సంపాదించి.. తృటిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఉంటే ఆమె కచ్చితంగా విజయం సాధించేవారు. ఎస్వీ సుబ్బారెడ్డి 45,751 ఓట్లుగా.. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన సీపీఐ నేత పి.రామచంద్రయ్యకు 21,388 ఓట్లు వచ్చాయి.
Also Read: MI vs KKR Playing 11: టాస్ గెలిచిన ముంబై.. రోహిత్ శర్మ దూరం.. అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ
ఆ తరువాత నీరజారెడ్డికి 2009లో ఆలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ప్రస్తుత మంత్రి, అప్పటి పీఆర్‌పీ అభ్యర్థి గుమ్మనూరు జయరాంపై 5,346 ఓట్ల మెజర్టీతో ఆమె విజయం సాధించారు. అయితే 2011 ఎమ్మెల్యే పదవికి నీరజారెడ్డి రాజీనామా చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పారు. ఆ తరువాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా నీరజారెడ్డి.. 2019లో అధికార వైసీపీలో చేరారు. 2020 వైసీపీకి గుడ్ బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆలూరు నిజయోకవర్గం ఇంఛార్జ్‌గా ఉంటూ బీజేపీ బలోపేతానికి ఆమె కృషి చేస్తున్నారు. నీరజా రెడ్డి అకాల మరణంతో ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: IPL Records: ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త ఓవర్లు ఇవే.. ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి