MI vs KKR Playing 11: టాస్ గెలిచిన ముంబై.. రోహిత్ శర్మ దూరం.. అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ

Arjun Tendulkar Entry in IPL: సచిన్ టెండూల్కర్ తనయుడి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎట్టకేలకు ప్లేయింగ్‌లో చోటు సంపాదించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2023, 03:53 PM IST
MI vs KKR Playing 11: టాస్ గెలిచిన ముంబై.. రోహిత్ శర్మ దూరం.. అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ

  Arjun Tendulkar Entry in IPL: ఐపీఎల్ 2023లో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. గత మ్యాచ్‌పై ఢిల్లీపై విజయంతో ముంబై జోరు మీద ఉండగా.. ఎస్ఆర్‌హెచ్ చేతిలో ఓటమితో కేకేఆర్ కసితో ఉంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగబోతుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతోంది. కడుపు నొప్పి కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమవ్వగా.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన సూర్య.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు.

 

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రోహిత్ శర్మ ప్లేస్‌లో అర్జున్ టెండూల్కర్‌కి అరంగేట్రం చేయగా.. డ్వేన్ జాన్సన్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కింది. సచిన్ టెండూల్కర్ కూడా ఐపీఎల్‌లో కేకేఆర్‌పైనే అరంగేట్రం చేయగా.. అర్జున్ కూడా యాదృచ్చికంగా అదేజట్టుపై ఐపీఎల్ కెరీర్ ప్రారంభించాడు. మ్యాచ్‌కు ముందు కడుపు నొప్పి కారణంగా రోహిత్ శర్మ సడెన్‌గా దూరమవ్వడంతో ముంబైకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌ లిస్ట్‌లో రోహిత్ శర్మ పేరు ఉంది. బ్యాటింగ్ సమయానికి సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

Also Read: GT vs RR Today Dream 11 Team: ఐపీఎల్‌లో నేడు బిగ్‌ఫైట్.. గుజరాత్ Vs రాజస్థాన్ డ్రీమ్ 11 టీమ్ ఇదే..  

తుది జట్లు ఇలా..

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరున్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్ 

 

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, ఎన్.జగదీషన్, నితీష్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గ్యూసన్, వరుణ్ చక్రవర్తి

Also Read:  IPL Records: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత చెత్త ఓవర్లు ఇవే.. ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే..?    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News