Amaravati land scam: అమరావతి రాజధాని పేరిట జరిగిన ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్జి అభివర్ణించారు. చంద్రబాబు, అతని బినామీలు కారుచౌకగా భూముల్ని కొట్టేశారని ఆరోపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమరావతి భూముల కుంభకోణం(Amaravati Land Scam)పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr Congress party)ఇవాళ మరోసారి మండిపడింది. చంద్రబాబు అండ్ కో పై తీవ్ర ఆరోపణలు చేసింది. అమరావతి రాజధాని పేరిట జరిగిన ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy)తెలిపారు. చంద్రబాబు సహా అతని బినామీలు పేదల భూముల్ని చౌకగా కొట్టశారని ధ్వజమెత్తారు. భూములు కొన్న తర్వాత ల్యాండ్ పూలింగ్ ( Land pooling) నిబంధనలను మార్చి తమ వారికి లబ్ధి చేకూర్చారన్నారు. దానికి సంబంధించినదే 41 జీవో అని..ఇందులో చంద్రబాబు, నారాయణ పాత్ర ఉందని చెప్పారు.  ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరుగుతుందని..చంద్రబాబు ఎప్పటిలానే స్టే తెచ్చుకున్నారన్నారు. వేల ఎకరాల్ని దోచుకునేందుకు చంద్రబాబు ఇలా చేశారని సజ్జల విమర్శించారు. 


వచ్చింది స్టే అయితే బాబు నిర్దోషి అని ప్రచారం చేసుకోవడమేంటని ప్రశ్నించారు. పేదలపై జరిగిన దాడిని కప్పిపుచ్చుకునేందుకు స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారన్నారు. జీవో 41 ద్వారా చంద్రబాబు అండ్ కో లబ్ది పొందారనే విషయాన్ని ప్రజలకు చెప్పదలిచామన్నారు. చంద్రబాబు(Chandrababu) ఆలోచన మంచిదే అయితే..ల్యాండ్ పూలింగ్ చట్టంలో అసైన్డ్ ల్యాండ్ గురించి  ఎంందుకు పెట్టలేదని చెప్పారు. దళితుల్నించి భూముల్ని కొన్న తరువాతే అంటే 2016లోనే చట్టంలో ఎందుకు చేర్చలేదని అడిగారు.


Also read: Tirupati Bypoll: తిరుపతి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook