అమరావతి: లాక్ డౌన్ 4.0 ( Lockdown4.0 ) మే 31తో ముగుస్తుండడంతో తదుపరి కార్యాచరణపై కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే లాక్‌డౌన్ 4.0లో ఇచ్చిన మినహాయిపులకు సంబంధించి నిర్ణయం తీసుకొనే పూర్తి అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ( Lockdown exemptions ) ఇచ్చిన నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ ప్రారంభం అవ్వడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రజల రద్దీ కూడా పెరిగింది. దీంతో అంతకుముందు కంటే కరోనా మహమ్మారి బారిన పడుతున్న రోగుల సంఖ్య ( Coronavirus positive cases ) కూడా అంతే గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఇంకా పొడిగించాలా ( Lockdown extension ) లేదా ఒకవేళ పొడిగిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? పొడిగించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే కోణంలో అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించే పనిలో కేంద్ర హోంశాఖ బిజీ అయ్యింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్ రెడ్డికి ( AP CM YS Jaganmohan Reddy ) కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ( Amit Shah ) ఫోన్‌ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : Kondapochamma Sagar : రైతులకు గుడ్ న్యూస్ : కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్


ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనావైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంది అనే అనేక అంశాలు ఇరువురి మధ్య చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కోవిడ్‌ –19 నివారణకు తీసుకున్న చర్యలను ( Measures to control ) కేంద్ర మంత్రి అమిత్ షాకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించినట్టు సమాచారం. అలా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాత వారి అభిప్రాయాలను సమీక్షించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..