అమరావతి: బడి పిల్లలను పాఠశాలలకు పంపించే తల్లులకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంపై తాజాగా సర్కార్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపించినా.. అందరికీ అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని ఏపీ సీఎం కార్యాలయం ప్రకటించింది. 


పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా.. ప్రైవేటు పాఠశాలల్లో చదివినా.. అందరికీ అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. పేదల పిల్లలు ప్రతీ ఒక్కరికీ విద్యను అందించాలనే లక్ష్యంతోనే అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని సర్కార్ తేల్చిచెప్పింది.