Anantapur Road Accident incident: అనంతపురం జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ యాక్సిడెంట్‌లో 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మోదీ పేర్కొన్నారు. మృతులకు ఆయన సంతాంపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాడ సానుభూతి తెలిపారు. ఇక బాధిత కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాని నష్ట పరిహారం ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతపురం జిల్లాలో (Anantapur District) తాజాగా రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. అనంతపురం, బళ్లారి నేషనల్ హైవేపై ఉరవకొండ మండలంలోని బూదగవి గ్రామం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఇన్నోవా (Innova) వాహనం, లారీ ఢీ కొనడంతో ఇన్నోవాలో ఉన్న 9మంది స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పొయారు. మృతుల్లో 6 మంది మహిళలు, ఇద్దరు పురుషులు, అలాగే ఒక చిన్నబాబు ఉన్నారు. 


మృతులంతా కూడా బొమ్మనహళ్‌, అలాగే ఉరవకొండ మండలంలోని లక్కవరం గ్రామాలకు చెందిన వారు. 


ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన వెంకటప్పనాయుడు కూతురు ప్రశాంతి వివాహం బళ్లారిలో జరిగింది. పెళ్లి కూతురు తండ్రి వెంకటప్పనాయుడుతో పాటు కొందరు బంధువులు కలిసి ఇన్నోవాలో బళ్లారి (Bellary) నుంచి నింబగల్లుకు తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం (Accident) జరిగింది. ఇన్నోవాను వెంకటప్పనాయుడు డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లారు. ఎదురుగా వస్తోన్న లారీ.. ఇన్నోవా కారును (Car) బలంగా ఢీకొట్టడంతో ఇన్నోవా నుజ్జు నుజ్జు అయిపోయింది.


Also Read: Singer Revanth Marriage: వివాహబంధంలోకి అడుగుపెట్టిన సింగర్ రేవంత్.. పెళ్లి ఫొటోలు వైరల్


Also Read: PNB rates: సేవింగ్స్ ఖాతా డిపాజిట్లకు వడ్డీ తగ్గించిన పీఎన్​బీ- కొత్త రేట్లు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook