Ravichandran Ashwin Retirement: టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. 38 ఏళ్ల ఈ లెజెండరీ స్పిన్నర్ రిటైర్మెంట్ ప్రకటన అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆసీస్‌తో మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని బీసీసీఐ పేర్కొంటూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. అశ్విన్‌ను భారత జట్టులో అమూల్యమైన ఆల్ రౌండర్‌గా పేర్కొంది. అన్ని ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 765 వికెట్లు తీసి లెజెండరీ బౌలర్ల సరసన చేరాడు.
మొత్తం 106 టెస్టులు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 537 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో కూడా మెరుపులు మెరిపించాడు. 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున అనిల్ కుంబ్లే (619) తరువాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ ఉన్నాడు. వన్డేల్లో 116 మ్యాచ్‌లు ఆడగా.. 156 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 707 పరుగులు చేయగా.. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. 65 టీ20 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 72 వికెట్లు పడగొట్టాడు.