ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల చివరివారంలో నాలుగు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం వివిధ వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. అమెరికా పర్యటనను ముగించుకుని 27న అమరావతికి ప‌య‌నం కానున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించాల్సిందిగా కోరుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం అందింది. వ్యవసాయ రంగంలో చంద్రబాబు చేస్తున్న కృషిని గుర్తించిన ఐరాస ఈ మేరకు ఆహ్వానించింది.  ‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’ అంశంపై న్యూయార్క్‌లోని యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనాలని చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. 2024నాటికి రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడింది.


ప్రకృతి వ్యవసాయంపై ఈ నెల 24న ఐక్యరాజ్యసమతిలో ప్రసంగించే అవకాశం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని టీడీపీ పార్టీ పేర్కొంది. దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పీఎంలు ఉన్నా చంద్రబాబుకే అవకాశం రావడం ఆయన పనితీరుకు నిదర్శనమని కొనియాడింది.