Kajal Agarwal photos: తెలుగు ప్రేక్షకుల మదిలో చందమామల మిగిలిపోయిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. పెళ్లి అయినప్పటికీ.. ఇంకా తెలుగులో మంచి ఆఫర్లు తగ్గించుకుంటూ.. స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. ఈ క్రమంలో కాజల్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సైతం.. ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉంటాయి.
పెళ్లి తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఇప్పుడు మళ్లీ పలు సినిమాలతో.. తెలుగు, తమిళంలో బిజీ అవుతూ వస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా.. కాజల్ అగర్వాల్ నటించిన భగవంత్ కేసరి చిత్రం.. మంచి విజయం అందుకుంది.
ఇక కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలో వచ్చిన సత్యభామ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా తరువాత హలో కాజల్.. లేడి ఓరియెంటెడ్..సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అని వినికిడి.
కాజల్ అగర్వాల్ కి వివాహం తర్వాత ఒక బాబు జన్మించిన సంగతి కూడా తెలిసిందే. ఒకపక్క తన ఫ్యామిలీని చూసుకుంటూనే.. ఈ హీరోయిన్ సినిమా ఆఫర్లు కూడా అందుకుంటుంది. కాగా కాజల్ త్వరలోనే.. ఇండియన్ 3 సినిమాలో కూడా కనిపించనుంది.
అయితే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా వచ్చిన ఇండియన్ 2 చిత్రం డిజాస్టర్ గా మిగలడంతో.. ఇప్పుడు ఈ సినిమాకి మూడో భాగం వస్తుందా లేదా అనేది ఎంతో మందికి ఉన్న సందేహం.
సినిమాల విషయం పక్కన పెడితే.. కాజల్ తన ఫ్యాషన్ ద్వారా కూడా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ మధ్య కాజల్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటూఉన్నాయి. ఈ ఫోటోలలో కాజల్ అచ్చం చందమామలా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.