ఢిల్లీ: లగడపాటి సర్వే చేశారంటే అది వాస్తవానికి చాలా దగ్గర ఉంటుందనే టాక్ ఉంది. గతంలోనూ అనేకసార్లు అది రుజువైంది. ప్రజల నాడిని పట్టుకోవడం దిట్టగా పేరున్న లగడపాటిని ఆంధ్రా ఆక్టోపస్ గా పిలుస్తుంటారు. ఇటీవలే ఆయన ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు ఆ సర్వే వివరాలు ఆయన బయటపెట్టలేదు. కాగా ఢిల్లీ టూర్ కు వచ్చిన ఆయన మీడియా కంటికి చిక్కారు. దీంతో సర్వే ఫలితాలపై విలేఖరులు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. విలేఖరులు ఎంతగా అడిగినప్పటికీ సమాధానం దాటవేస్తూ వచ్చాయి. ఈ క్రమంలో మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఫలితాల కంటే ముందు తన సర్వే ఫలితాలు ప్రకటిస్తానని చెప్పారు. ఒక వేళ అన్ని రాజకీయ పార్టీలు  ఒప్పుకుంటే తక్షణమే తన సర్వే ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రా ఆక్టోపస్... నోట చంద్రబాబు మాట


జగన్ దాడి అంశంపై స్పందిస్తూ దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని లడపపాటి పేర్కొన్నారు. వైసీపీ గురించి అడిగిన మిగిలిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. ఇక చంద్రబాబు విషయంలో మాత్రం కాస్త ఉత్సాహంగా స్పందించారు. బాబు ఢిల్లీ టూర్ పై ప్రశ్న వచ్చినప్పుడు చంద్రబాబును ప్రశంసిస్తూ వ్యాఖ్యాలు చేశారు. జాతీయ రాజకీయాల్లో రాణించడం చంద్రబాబుకు కొత్త కాదని.. ఆయన సత్తా ఉన్న నాయకుడని ..ఎంతో అనుభవం ఉన్న నేత అని కొనియాడారు.  అలాగే కాంగ్రెస్ -టీడీపీ పొత్తు తప్పేమి కాదని ..రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలు కలవడం సాధారణ అంశమేనన్నారు. కొత్త ప్రత్యర్థి వచ్చినప్పుడు.. పాత ప్రత్యర్థులు కలవడం తప్పేంటని ప్రశ్నించారు. ఆయన స్పందించిన తీరు చూస్తే ఆయన టీడీపీ , కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని ... ఆయన సర్వే ఫలితాలు కూడా ఇదే తీరులో ఉండే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  


తెలంగాణ నుంచి పోటీకి సై..


తన పొలిటికల్ ఎంట్రీపై స్పందిస్తూ తాను ఇప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఒక వేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే తాను ఆంధ్రా నుంచి పోటీ చేయబోనని.. తెలంగాణ నుంచి పోటీ చేయమని ఎవరైన అడిగితే తప్పకుండా పోటీ చేస్తానని చమత్కరించారు. లగడపాటి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా  టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి పోటీ చేయవచ్చనే ఊహానానాలు వినిపిసున్నాయి.