10th Hall Tickets 2024: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చ్ 18 నుంచి 30 వరకూ జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల 25 వేల మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఓవైపు ఇంటర్ పరీక్షల్ని పగడ్బందీగా నిర్వహిస్తూనే మరోవైపు పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు ఇవాళ్టి నుంచి విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్ధులు తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పదవ తరగతి పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో మార్చ్ 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాగా మార్చ్ 18 నుంచి 30 వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. రెగ్యులర్ పరీక్షలు మార్చ్ 28తోనే ముగియనుండగా ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలు మరో రెండ్రోజులంటాయి. రాష్ట్రంలో 7.25 లక్షల మంది పదవ తరగతి పరీక్షలు రాస్తుండగా, 3,473 సెంటర్లు సిద్ధం చేశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6.23 లక్షలున్నారు. మిగిలిన 1 లక్ష మంది పరీక్ష తప్పి తిరిగి ప్రవేశం పొంది రెగ్యులర్ విధానంలో రాస్తున్నవాళ్లున్నారు. 


పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా 156 ఫ్లయింగ్ స్క్వాడ్, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లు సిద్ధమయ్యాయి. 130 కేంద్రాల్లో సీసీ కెమేరాలు సైతం అమర్చారు. విద్యార్ధులు తమ హాల్ టికెట్లను www.bse.ap.gov.in నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేవలం తమ పేరు, పుట్టిన తేదీ స్కూల్, జిల్లా వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. పదవ తరగతి పరీక్షలు రోజూ ఉదయం 9.30 గంటల్నించి మద్యాహ్నం 12.45 గంటల వరకూ జరగనున్నాయి. 


పదవ తరగతి పరీక్షల టైమ్ టేబుల్


మార్చ్ 18వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్
మార్చ్ 19వ తేదీన సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 21వ తేదీన థర్డ్ లాంగ్వేజ్
మార్చ్ 23వ తేదీన మేథ్స్
మార్చ్ 26వ తేదీన ఫిజిక్స్
మార్చ్ 28వ తేదీన బయాలజీ
మార్చ్ 30వ తేదీన సోషల్ స్టడీస్


Also read: Ycp vs Prashant kishor: ఎన్ని పీకేలొచ్చినా పీకేదేం లేదు, ప్రశాంత్ కిశోర్‌పై మండిపడుతున్న వైసీపీ నేతలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook