SSC Exams: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం.. విద్యార్థులకు కీలక సూచనలు
AP SSC Exams Schedule: విద్యార్థులకు పరీక్షా కాలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడ కూడా లీకేజీ తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.
AP SSC Exams Schedule: ఏపీలో పదో తరగతి పరీక్షల సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. సీబీఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఆరు సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. లీకేజీ ఆరోపణలు రాకుండా విద్యా శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది.
నో మొబైల్ జోన్‌గా టెన్త్ పరీక్షా కేంద్రాలను అధికారులు ప్రకటించారు. ఇన్విజలేటర్లు, చీఫ్ సూపరిండిండెండ్లు, ఇతర అధికారులు సైతం పరీక్షా కేంద్రాలకి సెల్ ఫోన్ తీసుకురాకుండా నిషేధించారు. సమస్యాత్మకమైన 104 పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు.. అదనంగా మరో వంద కేంద్రాలలోనూ సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకి 6.64 లక్షల మంది విద్యార్ధులు హాజరు కానున్నారు.
టైమ్ టేబుల్ ఇలా..
==> ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్
==> ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్
==> ఏప్రిల్ 8న ఆంగ్లం
==> ఏప్రిల్ 10న గణితం
==> ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం
==> ఏప్రిల్ 15న సాంఘిక శాస్త్రం
==> ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు పరీక్ష
==> ఏప్రిల్ 18న వొకేషనల్ కోర్సు పరీక్ష
విద్యార్థులకు సూచనలు..
==> 8.45 గంటల నుంచి పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్ధులకి అనుమతి
==> టెక్నాలజీ సాయంతో లీకేజీకి చెక్
==> ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తెచ్చుకోకూడదు
==> ప్రతి ప్రశ్నా పత్రానికి బార్ కోడింగ్, ఏడెంకల నంబర్
==> హాల్ టిక్కెట్లు చూపితే పదో తరగతి విద్యార్ధులకి ఆర్టీసీ బస్‌లో ఉచిత ప్రయాణం
==> హాల్ టికెట్లతో పేరు, పుట్టిన రోజు తేదీ, ఫొటో అన్ని ముందే చెక్ చేసుకోవాలి
==> కచ్చితగా హాల్‌టికెట్‌లను ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకురావాలి. హాల్‌టికెట్ లేకపోతే పరీక్షకు అనుమతి ఉండదు.
==> ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ప్రశ్నలను వేర్వేరు ఆన్సర్ షీట్లలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
==> పరీక్ష ముగిసే వరకు అంటే.. 12:45 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లడానికి పర్మిషన్ లేదు.
==> రాష్ట్రస్ధాయిలో 0866-2974540 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
==> ప్రతీ జిల్లాలో కలెక్టర్లు, డీఈఓల పర్యవేక్షణలో జిల్లా స్ధాయి కంట్రోల్ రూమ్
==> పదో తరగతి పరీక్షల పర్యవేక్షణకు ప్రతీ జిల్లాకి ఒక పరిశీలకుడి నియామకం
==> రాష్ట్రవ్యాప్తంగా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు
==> వేసవి తీవ్రత నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద తాగు నీరు, టెంట్లు ఏర్పాటు
Also Read: LSG vs DC: లక్నో Vs ఢిల్లీ జట్ల మధ్య టఫ్ వార్.. ప్లేయింగ్ 11 ఇదే..!
Also Read: Kane Williamson: అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు.. కానీ వెంటాడిన దురదృష్టం.. సీజన్ మొత్తానికి దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి