AP 10th Exams: ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకూ జరగనున్న పదవ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి సూచనలు, విధి విధానాలను ప్రకటించింది ప్రభుత్వం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో 6.64 లక్షలమంది విద్యార్ధులు ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,449 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేసి..144 సెక్షన్ విధించారు. పేపర్ లీక్ కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమేరాలు, ఇయర్ ఫోన్లు, డిజిటల్ పరికరాల్నివిద్యార్ధులు, అధికారులు, ఇన్విజిలేటర్లు సహా ఎవరూ తీసుకురాకూడదు. పేపర్ల లీకేజ్, ఫేక్ ప్రచారాల నివారణకు మొబైల్ పోలీసు స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. డీఈవో కార్యాలయాల్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి. 


ఇక ఉదయం 8.45 నిమిషాల నుంచి 9.30 నిమిషాల వరకే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్ధుల్ని అనుమతిస్తారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకూ అంటే 3.15 గంటల సమయం ఉంటుంది. ఛీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ సహా ఎవరూ మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. పరీక్షా పత్రాల రక్షణకై డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్ పాయింట్స్ వద్ద కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ మెటీరియల్‌కు భద్రత ఉండేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. పరీక్, కేంద్రాలకు సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లు మూసివేసి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేట్టు చర్యలు తీసుకున్నారు. 


సమాధాన పత్రాల్ని కోడింగ్ విదానంతో మూల్యాంకనం చేయనున్నారు. ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26 వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఉంటుంది. అంటే ఏప్రిల్ నెలాఖరులోగా పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. వేసవి కావడంతో విద్యార్ధులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంల నియామకంతో పాటు తగిన మెడికల్ కిట్లను వైద్యశాఖ ఏర్పాటు చేస్తోంది. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం ఉండేట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


Also read: Pulivendula Firing News: పులివెందులలో కాల్పులు.. వివేకా హత్య కేసులో CBI విచారణ ఎదుర్కొన్న వ్యక్తి కాల్పులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook