Pawan Kalyan Delhi Strategy: ఢిల్లీ, బిహార్ ను దున్నేయనున్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan Delhi Strategy: పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం బీజేపీ ట్రంప్ కార్డ్ గా మారారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేనాని ప్రచారం చేసిన అన్ని చోట్లా గెలిచింది. ఈ రకంగా ప్రచారం చేసిన అన్ని చోట్లా గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన నేతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో బీజేపీకి స్టార్ క్యాంపెనర్ గా మారారు పవన్ కళ్యాణ్. తాజాగా ఈయన సేవలను మరింత వాడుకోవాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 26, 2024, 09:51 AM IST
Pawan Kalyan Delhi Strategy: ఢిల్లీ, బిహార్ ను దున్నేయనున్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan Delhi Strategy:  ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు బీజేపీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా మారారు. అంతేకాదు ఆ పార్టీ తురుపు ముక్కగా మారాడు. సనాతన బోర్డు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో జనసేనానికి దేశ వ్యాప్తంగా ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. బీజేపీ తర్వాత ఓ పార్టీ నాయకుడు హిందూత్వం గురించి ఈ రేంజ్ లో ఉపన్యాసాలు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆకాశామంత పెరిగిందనే చెప్పాలి. దీంతో ఆయన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల్లో ఆయన సినిమాలు కూడా తెలియని వాళ్లు కూడా పవన్ పై అభిమానాన్ని పెంచుకున్నారు. అంతేకాదు దక్షిణాదిలో హిందుత్వకు ఐకాన్ గా మారాడు. ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ నాయకులు చేయలేని పనిని జనసేనాని చేసి పెడుతున్నాడు. ఆ పార్టీ నాయకులే మాట్లాడానికి సంకోంచే విషయాలను కూడా ఎంతో నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఓ రకంగా దక్షిణాది యోగిగా ఎదిగారు.

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలోని బీజేపీ పెద్దలైన నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డాలు పవన్ కళ్యాణ్  సేవలను మరింత విస్తృతంగా వాడుకోవాలని భావిస్తోంది.  మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్‌కు మంచి ఫాలోయింగ్ ఉందని గుర్తించిన బీజేపీ అగ్రనేతలు ఇక ముందు జరిగబోయే ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేసేలా వ్యూహాలు రచిస్తోంది.

2025లో జరిగే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో పవన్‌ ప్రచారం చేసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన ఇప్పటికే ఓ రోడ్ మ్యాప్ తయారు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో తెలుగు వారున్న చోట పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలనే యోచనలో ఉన్నారు.ఓ వైపు హీరో.. మరోవైపు సనాతన ధర్మం అంటూ పవన్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లింది. అంతేకాదు ఏపీ నుంచి జాతీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదిగారు. దీంతో పవన్‌ ఇమేజ్‌తో ఓట్లు కొల్లగొట్టే వ్యూహాలకు బీజేపీ పదును పెడుతోంది.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News