APCC YS Sharmila Fires On CM Jagan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ఠను వైఎస్సార్సీపీ అన్నివిధాలుగా నాశనం చేసిందని,  ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో కూడా మనం ఊహించలేమని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలల పాటు వైసీపీ నేతలు సినిమా స్టంట్ వేశారన్నారు.  అసలు ఏపీలో ఆడుతున్న ఆటలు ఇవేనా?.. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా?.. అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Ruhani Sharma: అందాల విందు చేసిన కోహ్లీ మరదలు.. ఇలా ఎప్పుడు చూసుండరు..


ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రీడలపై వైసీపీ నేతల... క్రీనీడలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంకెన్ని దిగజారుడు ఆటలు ఆడతారని ఎద్దేవా చేశారు. ఆడుదాం ఆంధ్రలో క్రీడల్లో జరిగినర అవినీతిపై నిస్పాక్షికమైన విచారణ జరగాలని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలా డిమాండ్ చేశారు. 


ఇటీవల వైఎస్ షర్మిల తన అన్నపై తీవ్రమైన విమర్షలు చేస్తున్నారు. డీఎస్సీ పైన కూడా స్టూడెంట్స్ తో కలిసి సచివాలయంకు వెళ్లడానికి పిలుపునిచ్చారు. ఇది తీవ్ర రచ్చగా మారింది. దీంతో షర్మిలను, పోలీసులు ఎక్కడిక్కడే నిర్భందించారు.


Read More: Diabetes Diet: డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ 5 పండ్లు అస్సలు తినకూడదు..


చివరకు పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరగటంతో వైఎస్ షర్మిలను అరెస్టు చేసి, ఆతర్వాత సొంత పూచీకత్తుపై పోలీసులు వదిలేశారు. ఏపీలో వైఎస్సీర్పీపీ అనేక అక్రమాలకు పాల్పడిందని వైఎస్ ఆరోపించారు. ఇప్పటికైన ప్రజలు కళ్లు తెరిచి ఈసారి ఆలోచించి ఓటు వేయాలని షర్మిల సూచించారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook