AP Assembly Election 2024 Winners List: పవన్ కళ్యాణ్ జనసేన సంచలనం..పోటీ చేసిన 21 స్థానాల్లో ఆదిక్యం
AP Lok Sabha Election 2024 Full Winner List: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో సంచలనం సృష్టిస్తోంది. పోటీ చేసిన 21 స్థానాల్లో అన్ని స్థానాల్లో కూడా ఆదిక్యంగా నిలిచి.. అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది..
Andhra Pradesh Assembly Election 2024 Winners and Loosers List: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ.. టిడిపి తో కలిసింది అనగానే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. రాష్ట్రంలో వచ్చేది టిడిపినే అని ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టుగానే ఈరోజు కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచి.. టిడిపి,బిజెపి, జేఎస్పీ కూటమి హవా సాగిస్తూ వచ్చాయి. వైసీపీ ఎవరు అంచనా కూడా వేయనంత తక్కువ సీట్లను సొంతం చేసుకునేలా కనిపిస్తోంది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ మాత్రం.. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఆదిక్యంగా కొనసాగుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ విజయం దిశగా సాగుతోంది. టీడీపీతోపాటు జనసేన సైతం అంచనాలకు మించిన ఫలితాలను అందుకోవడం అందరిని ఆకట్టుకుంటుంది. కాగా టీడీపీతో పొత్తు ప్రకటన చేసిన దగ్గర నుంచి.. ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సమయం వరకు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురించే చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేయించారని ఎంతోమంది కామెంట్స్ పెట్టసాగారు. ఇక అందరూ అనుకున్నట్టుగానే అదే రుజువయింది. కూటమిలో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో.. అన్ని స్థానాల్లో కూడా ఆధిక్యం ఉండడం జనసేన కార్యకర్తల్లో ఎక్కడలేని ఆనందాన్ని నింపుతోంది. సోషల్ మీడియాలో సైతం.. టిడిపి గెలుపు కన్నా కూడా.. పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ పోస్టులు పదడం గమనర్హం.
ముఖ్యంగా గత 2019 ఎన్నికల్లో ఒక్క సీటుకే మాత్రమేపరిమితమైన జనసేన పార్టీ.. ఈ సారి డబుల్ డిజిట్ సీట్లు సాధించడం.. ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఆశలను రేకెత్తించాయి. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఈసారి పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారని.. అప్పుడే అప్పుడు పండగ చేసుకుంటున్నారు పవన్ అభిమానులు.
Also read: Vijayawada Lok Sabha Election Result: విజయవాడలో విజయం ఎవరిది అన్నదా తమ్ముడిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook