Rajahmundry Lok Sabha Election Result:రాజమండ్రి పీఠం పురంధరేశ్వరిదే, బీజేపీ ఖాతాలో మరోసారి

Rajahmundry Lok Sabha Election Result 2024: ఏపీలోని కీలకమైన లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటైన రాజమండ్రిలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం సాధించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2024, 02:20 PM IST
Rajahmundry Lok Sabha Election Result:రాజమండ్రి పీఠం పురంధరేశ్వరిదే, బీజేపీ ఖాతాలో మరోసారి

Rajahmundry Lok Sabha Election Result 2024: ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత కీలకమైన లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజమండ్రి ఒకటి. విశాఖపట్నం-విజయవాడ మధ్య సమదూరంలో ఉన్న ప్రాంతం. అందుకే అన్ని పార్టీలు రాజమండ్రిపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తుంటాయి. ఈసారి రాజమండ్రి ఎన్నిక మరింత ప్రత్యేకం కానుంది. ఇప్పుడీ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధిని, ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఘన విజయం సాధించారు. 

జిల్లాల పునర్విభజనకు ముందు ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యాపించి ఉన్న నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్. ఆ తరువాత పార్లమెంట్ నియోజకవర్గమే పరిధిగా తూర్పు గోదావరి జిల్లాగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పోటీ చేస్తుండటంతో రాజమండ్రి లోక్‌సభ ఎన్నిక ఆసక్తిగా మారింది. 

మే 13న జరిగిన పోలింగ్‌లో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 79.31 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మార్గాని భరత్ తొలిసారిగా పోటీ చేసి సమీప తెలుగుదేశం అభ్యర్ది మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ కోడలైన మాగంటి రూపపై 1,23,634 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి మురళీ మోహన్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మార్గాని భరత్‌కు 5,82,024 ఓట్లు దక్కగా, తెలుగుదేశం అభ్యర్ధిని మాగంటి రూపకు 4,60,390 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో 81.03 శాతం పోలింగ్ జరిగింది. 

ఈసారి రాజమండ్రి లోక్‌సభ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బరిలో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పోటీ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బరిలో నిలిచారు.రాజమండ్రి పార్లమెంట్ చరిత్ర చూసుకుంటే వలస నేతల్ని ఆదరించిన పరిస్థితి ఉంది. గతంలో సినీ నటి జమున, సినీ నటుడు మురళీ మోహన్ రాజమండ్రి నుంచి పోటీ చేసి గెలిచినవాళ్లే. 

1998, 1999, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరోసారి పురంధరేశ్వరి విజయం సాధించడం ద్వారా మూడు సార్లు బీజేపీ గెలిచినట్టయింది. వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌పై దాదాపు 2 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. 

Also read: Southwest Monsoon: వేగంగా కదులుతున్న రుతు పవనాలు, ఏపీలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News