AP Disha Act 2019 | ఏపీలో దిశా చట్టానికి అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం(AP Disha act 2019) త్వరలోనే అమలు కానుంది. ఏపీ దిశా చట్టానికి అసెంబ్లీలో ఆమోద ముద్ర పడింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన(AP Assembly session) దిశా చట్టానికి పార్టీలకతీతంగా సభ్యులు ఆమోదముద్ర వేశారు. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై నేరాలు చేసే వారికి ఈ చట్టం కింద 21 రోజుల్లో శిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం(AP Disha Act) త్వరలోనే అమలు కానుంది. ఏపీ దిశా చట్టానికి అసెంబ్లీలో(AP assembly session) ఆమోద ముద్ర పడింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దిశా చట్టానికి పార్టీలకతీతంగా సభ్యులు ఆమోదముద్ర వేశారు. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై నేరాలు చేసే వారికి ఈ చట్టం కింద 21 రోజుల్లో శిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్టానికి కొత్త రూపంగా వచ్చిన దిశా చట్టానికి ఇప్పటికే ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో మహిళా ప్రజా ప్రతినిధులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాఖీలు కట్టి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
Read also : ఏపీ అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కొనియాడిన సీఎం జగన్
దిశా చట్టం ప్రత్యేకతలు...
1. అత్యాచారాల కేసులో స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉంటే వారికి కచ్చితంగా ఉరి శిక్ష విధిస్తారు. మిగతా ఏ శిక్షలను పరిగణలోకి తీసుకోరు.
2. అత్యాచారాలు, మహిళలపై నేరాల్లో సరిపోయే సాక్ష్యాధారాలు ఉంటే.. తీర్పును 21 రోజుల్లోనే ఇవ్వాలని దిశా చట్టం నిర్దేశిస్తుంది.
3. రేప్ కేసులకు సంబంధించిన దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేయాలి. మిగతా 14 రోజులు ట్రయల్ నిర్వహించి తీర్పు వెలువరిస్తారు.
4. అత్యాచారాలు కాకుండా చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో జీవిత ఖైదు విధిస్తారు.
5. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లోనూ సాక్ష్యాధారాలు సరిగ్గా ఉంటే 21 రోజుల్లో తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది.
6. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 14 రోజుల్లో తుది తీర్పు ఇవ్వనున్నారు.
7. డిజిటల్, సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే 2 నుండి 4 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధింపు.
8. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కోర్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
Read also : మామ, మరుదుల నుంచి లైంగిక వేధింపులు.. భర్తకు చెబితే బెదిరింపులు!!
9. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాలను నియమించనున్నారు. జిల్లాల్లో డీఎస్పీల ఆధ్వర్యంలో కొత్త పోలీసు బృందాలు పని చేస్తాయి.
10. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కోర్టులకు ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు.