మామ, మరుదుల నుంచి లైంగిక వేధింపులు.. భర్తకు చెబితే బెదిరింపులు!!

కోడలిపై కన్నేసిన మామ... తల్లిలాంటి వదినపై అరాచకానికి పాల్పడిన మరుదులు.. ఇక్కడ ఘటనలు, నిందితులు వేరైనా.. బాధితురాలు మాత్రం ఒక్కరే. అవును మొత్తంగా ఆ కుటుంబమే ఓ మృగాళ్ల కుటుంబం అంటోంది ఓ అభాగ్యురాలు. కట్టుకున్న భర్తే కాదు... ఇంటికొచ్చిన కోడలిని కన్నకూతురిలా చూసుకోవాల్సిన మామ, వదినను తల్లిలా చూసుకోవాల్సిన మరుదులు... మొత్తంగా ఆ ఇల్లే ఓ ప్రత్యక్షనరకానికి కేరాఫ్ అడ్రస్ అంటోంది గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన ఓ అభాగ్యురాలు. 

Last Updated : Dec 11, 2019, 03:05 AM IST
మామ, మరుదుల నుంచి లైంగిక వేధింపులు.. భర్తకు చెబితే బెదిరింపులు!!

గుంటూరు: కోడలిపై కన్నేసిన మామ... తల్లిలాంటి వదినపై అరాచకానికి పాల్పడిన మరుదులు.. ఇక్కడ ఘటనలు, నిందితులు వేరైనా.. బాధితురాలు మాత్రం ఒక్కరే. అవును మొత్తంగా ఆ కుటుంబమే ఓ మృగాళ్ల కుటుంబం అంటోంది ఓ అభాగ్యురాలు. కట్టుకున్న భర్తే కాదు... ఇంటికొచ్చిన కోడలిని కన్నకూతురిలా చూసుకోవాల్సిన మామ, వదినను తల్లిలా చూసుకోవాల్సిన మరుదులు... ఇలా ఒకరేమిటి.. ఇద్దరేమిటి ? మొత్తంగా ఆ ఇల్లే ఓ ప్రత్యక్షనరకానికి కేరాఫ్ అడ్రస్. ఆఖరికి సాటి ఆడదైన అత్త కూడా ఆ మృగాళ్లతోనే కలిసి తనను వేధిస్తే.. ఇక తనకు దిక్కెవరు'' అంటూ నిస్సహాయ స్థితిలో గుంటూరు రూరల్‌ మండలం దాసరిపాలెంకు చెందిన ఓ మహిళ సోమవారం గుంటూరు అర్బన్‌ పోలీసులను ఆశ్రయించారు. ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా తాజాగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు.. తన కన్నీటిగాథను కళ్లకు కట్టినట్టు పోలీసులకు చెప్పుకుని బోరుమన్నారు. ఆ ఇంట్లో మామ కీచకుడిలా ప్రవర్తిస్తున్నాడని, తల్లిలా గౌరవించాల్సిన మరుదులు లైంగికదాడులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. 

గుంటూరు అర్బన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోడలి చేత కాళ్లు పట్టించుకునే వంకతో ఆ సమయంలో మామ అసభ్యంగా ప్రవర్తించిన తీరును, ఆ తర్వాత రెండు సందర్భాల్లో ఇద్దరు మరుదులు తనపై లైంగిక దాడికి పాల్పడి వేధించిన వైనాన్ని ఆమె పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. నాలుగో మరిది ఏకంగా పాలలో మత్తు ట్యాబ్లెట్లు కలిపి ఇచ్చి తాను మత్తులో ఉండగానే లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇంట్లో జరుగుతున్న అరాచకాల గురించి తన భర్తకు చెబితే.. ఇష్టం ఉంటే ఉండు, లేదంటే ఇంట్లోంచి వెళ్లిపొమ్మని బెదిరించాడని.. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెడితే... ఆ కోపంతో తనపై దొంగతనం నేరం మోపి అరెస్టు చేయించి రిమాండుకు పంపించారని తన కన్నీటి గాథను పోలీసులకు వివరించారామె. చివరకు ఇప్పుడు విడాకులకు అంగీకరిస్తూ నోటీసులపై సంతకం పెట్టాలని వేధిస్తున్నారని.. వినకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పిన బాధితురాలు.. తనకు వారి నుంచి ప్రాణరక్షణ కల్పించాలి అంటూ పోలీసులను వేడుకున్నారు.

Trending News