Somuveerraju Comments: ఏపీలో కోనసీమ ఘటనపై పొలిటికల్ వార్..సోమువీర్రాజు ఏమన్నారంటే..!
Somuveerraju Comments: ఏపీలో కోనసీమ ఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. కోనసీమ అల్లర్లు మీరే కారణమంటూ అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
Somuveerraju Comments: ఏపీలో కోనసీమ ఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. కోనసీమ అల్లర్లు మీరే కారణమంటూ అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ,జనసేన కార్యకర్తలే విధ్వంసం సృష్టించారని అధికార వైసీపీ చెబుతోంది. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఇటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. తాజాగా జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఫైర్ అయ్యారు.
కోనసీమలో జరుగుతున్న పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఘటన జరిగిందని విమర్శించారు. అమలాపురం, రావులపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు రణ రంగాన్ని తలపిస్తున్నాయన్నారు. దీనికి సీఎం జగన్ తీరు కారణమని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. అమలాపురం ఘర్షణకు తమ పార్టీ శ్రేణులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నెలరోజుల తర్వాత కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. మొదటే ఈపేరు పెట్టి ఉండే అంతా ప్రశాంతంగా ఉండేదని తెలిపారు. ప్రజాప్రతినిధులపై దాడులు జరగడాన్ని ఖండిస్తున్నామన్నారు సోమువీర్రాజు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని పిలుపును ఇచ్చారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా అని ప్రశ్నించారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కఠినంగా శిక్షించాలన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమాయ ప్రజల ప్రాణాలను వైసీపీ నేతలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు అండగా ఉండాలన్నారు. అతడి కుటుంబసభ్యులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Also read:SSC Exams: తాగుబోతు ఇన్విజిలేటర్... పీకలదాకా తాగి ఎగ్జామ్ హాల్‌కు.. సస్పెండ్ చేసిన విద్యాధికారి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి