AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలకమైన భేటీ ఇవాళ జరగనుంది. కరోనా మహమ్మారి సంక్రమణ, పీఆర్సీ వివాదం ప్రధాన ఎజెండాలుగా కేబినెట్ భేటీ ఉంటుందని తెలుస్తోంది. ఈ భేటీ తరువాత కేబినెట్ మార్పు కూడా ఉండవచ్చని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి సంక్రమణ ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో ఏకంగా 12 వేల కేసులు నమోదయ్యాయి. మరోవైపు పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా తేలలేదు. జగనన్న స్మార్ట్‌టౌన్ పథకం, సంక్షేమ పథకాలపై సమీక్షచేయాల్సి ఉంది. ఈ అన్ని అంశాల ఆధారంగా ఇవాళ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో పీఆర్సీ వివాదం ( PRC Issue), సినిమా టికెట్ల అంశం, కరోనా మహమ్మారి వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. కరోనా సంక్రమణ నేపధ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించే విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 


మరోవైపు చాలామంది మంత్రులకు ఇదే చివరి కేబినెట్ (Ap Cabinet Meeting)సమావేశం కావచ్చని సమాచారం. ఎందుకంటే చాలాకాలంగా విన్పిస్తున్న కేబినెట్ మార్పు త్వరలో చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. కొంతమంది మంత్రుల్ని తప్పించి..పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. పీఆర్సీ వివాదం ప్రధాన సమస్యగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్తగా ప్రకటించిన పీఆర్సీ కొనసాగుతుందా, లేదా జీవోలను ప్రభుత్వం రద్దు చేస్తుందా అనేది ఇవాళ తేలనుంది. ఇక కరోనా మహమ్మారికి (Corona Pandemic) సంబంధించి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించనుందని తెలుస్తోంది. నైట్ కర్ఫ్యూతో పెద్గగా ప్రయోజనం లేకపోవడంతో పగటిపూట కూడా ఆంక్షలు విధించే అవకాశాలు లేకపోలేదు. 


Also read: AP Corona cases: ఏపీలో కొత్తగా 12,615 కరోనా కేసులు, ఐదు మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook