AP Cabinet: ఏపీ కేబెనెట్లో మార్పులు, ఆ మంత్రి అవుట్, నాగబాబు ఇన్, ఎప్పుడంటే

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో కీలక మార్పులు జరగనున్నాయి. ఒకరిద్దరు మంత్రులకు ఊస్టింగ్ తప్పదన్పిస్తోంది. అదే సమయంలో నాగబాబుకు బెర్త్ కన్ఫామ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet: ఏపీలోని కూటమి ప్రభుత్వ హయాంలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుందని తెలుస్తోంది. మరో రెండు వారాల్లో అంటే సంక్రాంతికి ముందే కేబినెట్ మార్పులు జరగవచ్చని సమాచారం. ఒకరిద్దరు మంత్రుల్ని తప్పించవచ్చనే సంకేతాలు బలంగా విన్పిస్తున్నాయి. అటు జనసేన తరపున నాగబాబు కేబినెట్‌లో చేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే కేబినెట్ మార్పులు జరగనున్నాయి. జనసేన తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్‌లో స్థానం ఇప్పటికే కన్ఫామ్ కావడంతో మార్పు తప్పదని తెలుస్తోంది. నాగబాబు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇప్పటికే పార్టీ నేతలకు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సంకేతాలు వదిలారు. దీనికి కారణం మంత్రుల పనితీరు బాగాలేదని ఆయన అభిప్రాయపడటమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పని తీరు సరిగ్గా లేని ఒకరిద్దరు మంత్రులపై వేటు పడవచ్చని తెలుస్తోంది.
కేబినెట్ నుంచి పదవీచ్యుతులయ్యేవారిలో కొత్తవారి పేర్లే విన్ఫిస్తున్నాయి. అందులో కోనసీమ జిల్లా నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన మంత్రి వాసంశెట్టి సుభాష్. బీసీ కేటగరీ సమీకరణాల్లో మంత్రి పదవిని కొట్టేసిన వాసంశెట్టి సుభాష్ నిలుపుకోలేకపోతున్నారు. మంత్రిగా పనితీరు కనబర్చకపోవడమే కాకుండా ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. మంత్రిత్వ శాఖను సరిగా నిర్వహించలేకపోతున్నట్టు సమాచారం. వాసంశెట్టి సుభాష్‌తో పాటు మరో మంత్రిని కూడా తొలగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇక జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మంత్రివర్గంలో స్థానంలో నిశ్చయమైంది. జనవరి 8న మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొందరి శాఖల్లో మార్పులు జరగనున్నాయి. ఇక పార్టీ పరంగా సహకార సంస్థలు, మార్కెట్ కమిటీ పదవుల పందేరం కూడా త్వరలోనే జరగనుంది. నామినేటెడ్ పదవుల ప్రక్రియ త్వరగా పూర్తి చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 222 మార్కెట్ కమిటీలుంటే ఒక్కొక్క కమిటీకు 15 మంది సభ్యుల్ని నియమిస్తారు. ఈ లెక్కన చాలామందికి పదవులు లభించనున్నాయి.
Also: AP Heavy Rains: ఏపీని వీడని భారీ వర్షాలు, రానున్న 24 గంటలు తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.