AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశాలున్నా భారీ వర్షాలు మాత్రం పడనున్నాయి. వరుస అల్పపీడనాలతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని ఐఎండీ వెల్లడించింది.
గత కొద్ది రోజులుగా ఏపీని భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. వాతావరణంలో మార్పుల్ని అంచనా వేయడం కష్టంగా మారుతోంది. పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాలకు భారీ వర్షసూచన ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలోనూ దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. గత 24 గంటల్లో పార్వతీపురం మన్యం, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం ప్రాంతాల్లో 3-4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే మూడు రోజుల్లో ప్రకాశం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం తీరానికి సమీపంలో ఉండటం వల్ల తీర ప్రాంత జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిన్న అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు తప్పేట్టు లేవు. తీవ్ర అల్పపీడనం కారణంగా తూర్పు గోదావరి, కాకినాడ, కళింగపట్నం, విశాఖపట్నం, తుని, మచిలీపట్నం, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3-7 డిగ్రీలు తగ్గాయి. ఉదయం వేళ దట్టమైన పొగమంచు కన్పిస్తోంది.
Also read: YS JAGAN: వైఎస్ షర్మిలకు జగన్ రిటర్న్ గిఫ్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.